Fishes: నీటిలో ఉండే చేపలు ఎప్పుడు నిద్రపోతాయి..? ఈత కొట్టడం ద్వారా అలసిపోతాయా..?
Fishes: అక్వేరియం (Fish Aquarium)లో చేపలను చూసినప్పుడల్లా అవి ఎప్పుడూ ఈత కొడుతూ ఉండటాన్ని చూసి ఉంటాము. ఈ చేపలకు ఈత కొట్టడం వల్ల అలసిపోవు. చేపలు కూడా..
Fishes: అక్వేరియం (Fish Aquarium)లో చేపలను చూసినప్పుడల్లా అవి ఎప్పుడూ ఈత కొడుతూ ఉండటాన్ని చూసి ఉంటాము. ఈ చేపలకు ఈత కొట్టడం వల్ల అలసిపోవు. చేపలు కూడా అలసిపోయి నిద్రపోతాయి (Sleeping). పరిశోధకుల వివరాల ప్రకారం.. చేప (Fish)లకు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. సాధారణంగా అక్వేరియంలో ఉండే చేపలు ఎప్పుడూ మెలకువతో కనిపిస్తుంటాయి. అవి ఎప్పుడు నిద్రపోతాయి.. ఎలా పోతాయి అని సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా గోల్డేన్ ఫిష్ (Golden Fish).. ఎప్పుడు ఎంతో హుషారుగా ఈత కొడుతుంటుంది. చేపలు మనుషులలాగే నిర్ణీత సమయాల్లో పడుకుంటాయి. చాలా రకాల చేపలు రాత్రి పూట పడుకుని పొద్దున్ననంత మెలకువగా ఉంటాయి. కొన్ని రకాలు దీనికి విరుద్ధంగా రాత్రిపూట తిరుగుతూ పొద్దుట పూట నిద్రపోతాయి. చేపలకి రెప్పలు ఉండనందున అవి ఎప్పుడు నిద్రపోతున్నాయో మనం చూడడం కష్టం. ముందుగా మనకు విశ్రాంతి ఎంత అవసరమో, చేపలకు కూడా విశ్రాంతి అంతే అవసరం. అందుకే చేపలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి.
చేపలు రోజంతా ఏ సమయంలోనైనా నిద్రపోవడం ద్వారా వాటి అలసటను భర్తీ చేస్తాయి. కొన్నిసార్లు పగలు, కొన్నిసార్లు రాత్రి పూట నిద్రిస్తుంటాయి. చేపలు రోజంతా చాలా సార్లు తక్కువ వ్యవధిలో నిద్రపోతాయి. కానీ నిద్రపోతున్నప్పుడు వాటి మెదడు చురుకుగా ఉంటుంది. చేపలు ఇతర జంతువులలా గాఢనిద్రలో పడుకోవడం లాగా ఉండదు. నిద్రపోతున్న సమయంలో కూడా వాటి మెదడు యాక్టివ్‌గా పని చేస్తుంటుందని చెబుతున్నారు. చేపలు ఎక్కడ నిద్రిస్తాయి?: చేపలు తరచుగా నీటి కింద మాత్రమే నిద్రిస్తాయి. అక్వేరియంలో ఉంచిన చేపలు కూడా కొన్నిసార్లు ఈత కొట్టడం మానేయడం మీరు చూసి ఉంటారు. ఈ సమయంలో ఇవి మాత్రమే విశ్రాంతి తీసుకుంటాయి. అదే అక్వేరియంలో చేపలు కొన్నిసార్లు ఒకే చోట ఒక మూలలో నిశ్చలంగా కనిపిస్తాయి. ఆ సమయంలో అవి నిద్రపోతూ ఉంటాయి.
చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి వాటి కళ్లు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. ప్రతి చేప నిద్రించే విధానం భిన్నంగా ఉంటుంది. చాలా చేపలు లోతుగా వెళ్తాయి లేదా రాయి కింద కింద నిద్రపోతాయి. ఇలాగే చేపలు వాటి గుడ్లను జాగ్రత్తగా చూసుకుంటూ ఈత కొడుతుంటాయి. ఒక వేళ నిద్రించినా వాటి గుడ్లపై నిఘా ఉంచుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: