AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 Effect: మరో కలకలం.. కోవిడ్ పేషెంట్లలో వినికిడి లోపం.. ఢిల్లీ వెలుగులోకి 15 కేసులు..

COVID-19 Effect: అకస్మాత్తుగా వినికిడి లోపం ఏర్పడిందా? మీ చెవుల్లో ఈలలు మోగుతున్నాయా? మీరు ఇటీవల కరోనావైరస్ నుండి కోలుకుని...

COVID-19 Effect: మరో కలకలం.. కోవిడ్ పేషెంట్లలో వినికిడి లోపం.. ఢిల్లీ వెలుగులోకి 15 కేసులు..
Hearing Problems
Shiva Prajapati
|

Updated on: Jun 13, 2021 | 8:03 AM

Share

COVID-19 Effect: అకస్మాత్తుగా వినికిడి లోపం ఏర్పడిందా? మీ చెవుల్లో ఈలలు మోగుతున్నాయా? మీరు ఇటీవల కరోనావైరస్ నుండి కోలుకుని ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే.. మీకు ఈ వార్త ఎంతో ముఖ్యమైనది. కరోనావైరస్ నుండి కోలుకుంటున్న చాలా మంది రోగులలో వినికిడి లోపం సంభవిస్తోంది. మరి కొంతమందిలో, ఈ వ్యాధి చికిత్స చేయలేనిదిగా మారుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అంటే, దీని ప్రభావంతో బాధితులకు మునపటిలా వినికిడి సామర్థ్యం ఉండదు. ఢిల్లీలోని ప్రభుత్వ అంబేద్కర్ ఆసుపత్రిలోని ఇఎన్‌టి విభాగానికి ఇప్పటివరకు ఇలాంటి సమస్యలతో 15 మంది రోగులు వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు.

ఢిల్లీకి చెందిన డాక్టర్ సౌరభ్ నారాయణ్‌కు గతేడాది కరోనా వైరస్‌ సోకింది. దాంతో అతను ఒక ప్రైవేట్ ఆసుపత్రి యొక్క ఐసియులో 21 రోజులు పాటు చికిత్స పొందాడు. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ.. అతనిలో వినికిడి సమస్య ఉత్పన్నమయ్యింది. మునుపటిలా దేనినీ వినలేకపోతున్నాడు. ఈ విషయం అతను ఆలస్యంగా గుర్తించడంతో.. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చికిత్స చేయడానికి కూడా ఆస్కారం లేకుండా పోయిందని వైద్యులు చెబుతున్నారు.

ఇక గణాంకాలను పరిశీలిస్తే.. గత 2 నెలల్లో ఇలాంటి సమస్యలతో బాధపడుతూనే 15 మంది రోగులు దేశ రాజధాని ఢిల్లీలోని అంబేద్కర్ ఆస్పత్రికి వచ్చారు. వీరంతా చెవుల్లో నొప్పి, వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఈ రోగులందరూ కరోనావైరస్ వ్యాధి నుండి కోలుకున్నవారే కావడం గమనార్హం. ఇక చాలా మంది రోగులు తమ సమస్యను గుర్తించక.. ఆలస్యంగా వైద్యులను సంప్రదిస్తున్నారు. దాంతో జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయి చికిత్స కూడా చేయలేని పరిస్థితి నెలకొంటుంది. అయితే సకాలంలో చికిత్స చేస్తే ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

మీ చెవిలో నొప్పి, బరువుగా, ఈలలు మోగినట్లు అనిపించినా, వినికిడి లోపం అనిపించినా.. మీరు 72 గంటలలోపు వైద్యుడిని సంప్రదించాలని అంబేద్కర్ ఆసుపత్రి ఈఎన్‌టి స్పెషలిస్ట్ డాక్టర్ పంకజ్ కుమార్ చెప్పారు. ప్రారంభ దశలో ఉన్నట్లయితే.. ఈ వినికిడి నష్టాన్ని మందులతో నివారించవచ్చన్నారు. ఆలస్యం చేస్తే రికవరీ అయ్యేందుకు సాధ్యపడదన్నారు.

Also read:

Chicken Biryani: గుమ గుమలాడే ధమ్ భిర్యానీ.. ఇప్పుడు మరింత సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండి..