Covaxin: చిన్నారులకు కోవిడ్ టీకా వచ్చేసింది.. కోవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్..
చిన్నారులకు దేశీయ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. 2-18 ఏళ్లలోపు పిల్లలకు కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా కీలక...
చిన్నారులకు దేశీయ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. 2-18 ఏళ్లలోపు పిల్లలకు కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా కీలక అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్‌లో చిన్నారులపై కోవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయిల్స్ పూర్తి కాగా.. వాటి సంబంధించిన ఫలితాలను వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ పరిశీలించింది. 18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ టీకాను వినియోగించేందుకు ఎక్స్‌పర్ట్ ప్యానల్ సిఫారసు చేసింది. దీనితో కేంద్రం అనుమతి పొందిన తొలి దేశీయ తీకాగా కోవాగ్జిన్ నిలిచింది.
కాగా, 2, 3 దశల్లో రెండు డోసుల కోవాగ్జిన్‌ను 525 మంది చిన్నారులపై భారత్ బయోటెక్ ప్రయోగాలు జరిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కోవాగ్జిన్ టీకాను 12 -18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిపై, 6-12 సంవత్సరాలు, అలాగే 2-6 సంవత్సరాల వారిపై మూడు దశల్లో ప్రయోగాలు జరిపారు. వైరస్‌ను ఎదుర్కోవడంలో కోవాగ్జిన్ ఎంతమేరకు ప్రభావితం చూపించిందన్న డేటా ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది.
Subject Expert Committee (SEC) has given a recommendation to DCGI (Drugs Controller General of India) for the use of BharatBiotech’s Covaxin for 2-18 year olds: Official sources
— ANI (@ANI) October 12, 2021
Read Also: సోఫాలో కూర్చున్నారు.. ఊహించని షాక్ తిన్నారు.. పక్కనే ఉన్న సీన్ చూసి నోరెళ్లబెట్టారు.!
ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచవద్దు.. మీ జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు.!
గేల్, రస్సెల్, మ్యాక్స్‌వెల్‌ను మించిపోయాడు.. సిక్సర్ల రారాజుగా అవతరించాడు.. ఎవరో తెలుసా.?
పెళ్లి వేదికపై మరీ ఇంతలానా.. వధువు చేసిన పనికి వరుడు షాక్.. చూస్తే నవ్వాపుకోలేరు!