Viral Video: పెళ్లి వేదికపై మరీ ఇంతలానా.. వధువు చేసిన పనికి వరుడు షాక్.. చూస్తే నవ్వాపుకోలేరు!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Oct 12, 2021 | 9:13 AM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచం నలుమూలల వింతలు-విశేషాలు ఏం జరిగినా కూడా ఇట్టే సోషల్ మీడియాలో..

Viral Video: పెళ్లి వేదికపై మరీ ఇంతలానా.. వధువు చేసిన పనికి వరుడు షాక్.. చూస్తే నవ్వాపుకోలేరు!
Marriage

Follow us on

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచం నలుమూలల వింతలు-విశేషాలు ఏం జరిగినా కూడా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రతీ రోజూ లక్షల్లో వైరల్ వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. నెటిజన్లు ఎక్కువగా ఆసక్తిని చూపించే వీడియోల్లో మ్యారేజ్ కంటెంట్ ఒకటి.. ఇలాంటి వీడియోల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దానిని చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు నవ్వాపుకోలేరు.!

వైరల్ వీడియో ప్రకారం.. వేదికపై నిల్చున్న వధూవరులు ఒకరి మెడలో ఒకరు వరమాల వేసుకోవాలి. అయితే ఇక్కడేదో పోటీ జరుగుతున్నట్లు ఇద్దరూ కూడా నేనంటే.. నేనంటూ.. గొడవపడుతూ వరమాలను వేసుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మొదట ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత వారు చేసిన పనిని చూసి నవ్వుకున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

కాగా, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దీనిని 1.72 లక్షల మంది వీక్షించారు. అలాగే 2.7 వేల లైకులు వచ్చాయి. ‘ఇప్పుడే వీరిద్దరి మధ్య ఇలా ఉంటుంది.. వివాహం తర్వాత ఇంకేలా ఉంటుందో’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఈ వీడియో చూసిన తర్వాత నవ్వాపుకోలేకపోయాను’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఈ వధూవరుల గొడవ చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

Also Read:

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu