గేల్, రస్సెల్, మ్యాక్స్‌వెల్‌ను మించిపోయాడు.. సిక్సర్ల రారాజుగా అవతరించాడు.. ఎవరో తెలుసా.?

టీ20 క్రికెట్ అంటేనే బౌలర్లకు ఊచకోత తప్పదు. గ్రౌండ్ నలుమూలల బ్యాట్స్‌మెన్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడతారు. ఇక ఈ ఫార్మాట్‌లో..

గేల్, రస్సెల్, మ్యాక్స్‌వెల్‌ను మించిపోయాడు.. సిక్సర్ల రారాజుగా అవతరించాడు.. ఎవరో తెలుసా.?
Philips

టీ20 క్రికెట్ అంటేనే బౌలర్లకు ఊచకోత తప్పదు. గ్రౌండ్ నలుమూలల బ్యాట్స్‌మెన్లు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడతారు. ఇక ఈ ఫార్మాట్‌లో ఓ కొత్త ఆటగాడు సిక్సర్ల రారాజుగా అవతరించాడు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, మ్యాక్స్‌వెల్ లాంటి అద్భుత ఆటగాళ్లను పక్కనబెట్టి.. సిక్సర్ల కింగ్‌గా అగ్రస్థానాన్ని దక్కించుకున్న ఆ 24 ఏళ్ల యువ బ్యాట్స్‌మెన్ ఎవరో కాదు. న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అయిన ఫిలిప్స్.. ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

ఈ విషయంపై వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన గ్లెన్ ఫిలిప్స్.. “జిమ్ చేయడం వల్ల సిక్సర్లు కొట్టే సామర్థ్యం పెరిగింది. ఇది జిమ్‌లో చేసిన కృషి, క్రికెట్‌పై ఉన్న అవగాహన వల్లే జరిగింది. సిక్సర్లు కొట్టే లైన్ అండ్ లెంగ్త్‌ను కూడా అర్ధం చేసుకోవడం నా బలం” అని పేర్కొన్నాడు.

2021 సంవత్సరంలో సిక్సర్ల రారాజు.!

గ్లెన్ ఫిలిప్స్ 2021వ సంవత్సరంలో ఇప్పటివరకు 89 సిక్సర్లు కొట్టాడు. అతడు 48 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అలాగే ఈ 48 ఇన్నింగ్స్‌లో ఫిలిప్స్ పేరిట 9 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత రెండో స్థానంలో ఇంగ్లాండ్ క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టన్ ఉన్నాడు. అతడు 37 ఇన్నింగ్స్‌లలో 82 సిక్సర్లు బాదాడు. ఈ ఏడాది 9 మ్యాచ్‌ల్లో 75 సిక్సర్లు కొట్టిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయిస్ మూడో స్థానంలో ఉన్నాడు.

గేల్, రస్సెల్. మాక్స్‌వెల్ … అందరినీ ఓడించాడు..

ఈ ఏడాది వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఇప్పటివరకు 50 సిక్సర్లు కొడితే.. గేల్ 41 సిక్సర్లు, మ్యాక్స్‌వెల్ 35 సిక్సర్లు కొట్టారు. అయితే ఈ సంవత్సరం వీరందరూ కూడా టీ20 మ్యాచ్‌లు తక్కువ ఆడితే.. ఫిలిప్స్ ఎక్కువగా టీ20లు ఆడటం గమనార్హం.

Also Read:

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu