Virat Kohli: 9 ఏళ్ల నిరీక్షణ ఫలించలే.. ఆర్‌సీబీకి మరోసారి మొండిచేయి.. కోహ్లీ కెప్టెన్సీలో అందని ద్రాక్షగానే ఐపీఎల్ ట్రోఫీ..!

వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి విరాట్ కోహ్లీ ఆర్‌సీబీకి కెప్టెన్‌గా ఉండని సంగతి తెలిసిందే. యూఏఈలో రెండవ సీజన్ ప్రారంభానికి ముందే ఈ విషయాన్ని ప్రకటించాడు.

Virat Kohli: 9 ఏళ్ల నిరీక్షణ ఫలించలే.. ఆర్‌సీబీకి మరోసారి మొండిచేయి.. కోహ్లీ కెప్టెన్సీలో అందని ద్రాక్షగానే ఐపీఎల్ ట్రోఫీ..!
Virat Kohli
Follow us

|

Updated on: Oct 12, 2021 | 9:11 AM

IPL 2021: ఐపీఎల్ 2021 ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమితో ఆర్‌సీబీ తన మొదటి టైటిల్ గెలుచుకోవాలనే కల మరోసారి చెదిరిపోయింది. జట్టు ఓడిపోయినందుకు ఆర్‌సీబీ అభిమానులు ఎంతగానో బాధపడుతుండగా, విరాట్ కోహ్లీ దాదాపు 10 సంవత్సరాల పాటు జట్టుకు నాయకత్వం వహించి జట్టును ఛాంపియన్ చేయడంలో విఫలమయ్యాడు. కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి చివరి మ్యాచ్‌గా ముగిసింది. కోహ్లీ 9 సంవత్సరాల నిరీక్షణ పూర్తి కాకుండానే వెనుదిరిగాడు. అతను తన కెప్టెన్సీలో జట్టు ఛాంపియన్‌గా మారలేకపోయింది.

ఐపీఎల్ 2021 రెండవ సీజన్ ప్రారంభానికి ముందు, విరాట్ కోహ్లీ ఈ సీజన్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. అయితే, భవిష్యత్తులో తాను ఆర్‌సీబీతో అనుబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నానని.. కానీ, బ్యాట్స్‌మెన్‌గా జట్టు కోసం పని చేస్తానని విరాట్ హామీ ఇచ్చాడు. అప్పటి నుంచి అభిమానులు, ఆర్‌సీబీ బృందం తమ కెప్టెన్‌కు ఛాంపియన్‌గా వీడ్కోలు పలకాలని కోరుకున్నారు. అయితే వీరి ఆశలకు కేకేఆర్ టీం అడ్డుపడింది.

ఆర్‌సీబీని ఛాంపియన్‌గా చేయలేకపోయాడు.. విరాట్ కోహ్లీ.. అతని కెప్టెన్సీలో ఆర్‌సీబీ కోసం ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ఓసారి పరిశీలిస్తే.. 2013 లో జట్టు పూర్తి బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ.. (2011, 2012 లో విరాట్ కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు) ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆర్‌సీబీ ఈ లీగ్‌లో మొత్తం 140 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఈ జట్టు 64 మ్యాచ్‌లు గెలిచింది. 69 మ్యాచ్‌లు ఓడిపోయింది. కెప్టెన్‌గా కోహ్లీ ఈ లీగ్‌‌లో ఇప్పటివరకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్నాడు. అత్యధిక మ్యాచ్‌లను గెలవడంలో కూడా విజయం సాధించాడు. అలాగే అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా రెండవ స్థానంలో నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోని మొదటి స్థానంలో ఉన్నాడు.

కెప్టెన్‌గా చివరి ఐపీఎల్ కెప్టెన్‌గా తన చివరి ఐపీఎల్ ఆడటంపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ‘నా ఉత్తమమైనదాన్నే ఇచ్చాను. నేను 120 శాతం అందిచాను. మైదానంలో ఆటగాడిగా ఫ్రాంచైజీకి సహకారం కొనసాగిస్తాను. రాబోయే మూడేళ్లపాటు జట్టును పునర్నిర్మించే అవకాశం ఉంది. నేను బెంగళూరు కోసం మాత్రమే ఆడతాను. నిజాయితీ నాకు ముఖ్యం. ఐపీఎల్‌లో నా చివరి మ్యాచ్‌ వరకు నేను ఆర్‌సీబీలోనే ఉంటాను’ అని తెలిపాడు.

Also Read: IPL 2021 Purple Cap: టాప్ 5 లో నలుగురు భారత బౌలర్లు.. అగ్రస్థానంలో కోహ్లీ ఫేవరేట్ ప్లేయర్

ఇండియన్‌ బ్రాడ్‌మాన్ ఎవరో తెలుసా..10 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు..11 డబుల్ సెంచరీలు చేశాడు..

IPL 2021 Orange Cap: జోరు తగ్గని కేఎల్ రాహుల్‌.. లీగ్‌ నుంచి నిష్ర్కమించినా అగ్రస్థానంలోనే.. వచ్చే ఏడాది పంజాబ్‌కు గుడ్ బై చెప్పనున్నాడా?