IPL 2021 Purple Cap: టాప్ 5 లో నలుగురు భారత బౌలర్లు.. అగ్రస్థానంలో కోహ్లీ ఫేవరేట్ ప్లేయర్

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తికి టోర్నమెంట్ ముగింపులో పర్పుల్ క్యాప్ లభించనుంది. సీజన్ మొదటి మ్యాచ్ నుంచి ఆర్‌సీబీ మిడిల్ పేసర్ హర్షల్ పటేల్ ముందంజలో కొనసాగుతున్నాడు.

IPL 2021 Purple Cap: టాప్ 5 లో నలుగురు భారత బౌలర్లు.. అగ్రస్థానంలో కోహ్లీ ఫేవరేట్ ప్లేయర్
Harshal Patel
Follow us

|

Updated on: Oct 12, 2021 | 8:34 AM

IPL 2021: ఐపీఎల్ 2021 లో రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరిగాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (RCB vs KKR), చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (CSK vs DC) మధ్య పోరు జరిగింది. అయితే తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం బెంగళూరును సులభంగా ఓడించి, రెండవ క్వాలిఫయర్‌కు చేరుకుంది. రెండో ఎలిమినేటర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ఈ ఓటమితో బెంగళూరు ప్రయాణం ముగిసింది. మరోసారి మొదటి టైటిల్ గెలవాలనే కల అసంపూర్తిగానే మిగిలిపోయింది. అయితే బెంగుళూరుకు ఈ సీజన్‌లో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే, హర్షల్ పటేల్ బౌలింగ్. టోర్నమెంట్‌లో అతని ప్రయాణం ఎంతో విజయవంతంగా సాగింది. దీంతో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచేలా చేసింది.

ఐపీఎల్‌లో పరుగుల వేటలో వికెట్ల వర్షం కూడా అప్పుడప్పుడూ చోటు చేసుకుంటోంది. అయితే ఈ వికెట్ల వర్షాన్ని హర్షల్ పటేల్ తన మొదటి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు నిరంతరం కురిపిస్తూనే ఉన్నాడు. ఈ బౌలర్ ప్రదర్శన ఫలితంగానే ఆర్‌సీబీ జట్టు ఇక్కడ వరకు వచ్చింది.

భారత బౌలర్ల ఆధిపత్యం.. ఈసారి పర్పుల్ క్యాప్ రేసులో భారత ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఆధిపత్యం చూపించారు. హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ వంటి కొత్త బౌలర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. మొత్తంగా టాప్ 5 లో నలుగురు భారత బౌలర్లే కావడం విశేషం. అయితే ఇందులో టీమిండియా తరపున ఆడుతున్న బుమ్రా, షమీ మూడు, నాలుగు స్థానాలకు పరిమితమవ్వగా, తొలి రెండు స్థానాల్లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ నిలవడం విశేషం. ఏదేమైనా ఏ బౌలర్ కూడా హర్షల్ పటేల్‌ని దాటలేకపోతున్నాడు. తొలి ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత హర్షల్ పటేల్ ఖాతాలో మరిన్ని వికెట్లను జోడించడంతో పర్పుల్ క్యాప్‌ను తన వద్దే ఉంచుకునేదుకు సిద్ధమయ్యాడు. అయితే దేవదత్ పడిక్కల్ క్యాచ్ పడడంతో హర్షల్ పటేల్ డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు.

పర్పుల్ క్యాప్ రేసులో టాప్ 5 బౌలర్.. 1. హర్షల్ పటేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 15 మ్యాచ్‌లు, 32 వికెట్లు 2. అవేశ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 15 మ్యాచ్‌లు, 23 వికెట్లు 3. జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) – 14 మ్యాచ్‌లు, 31 వికెట్లు 4. మహమ్మద్ షమీ (పంజాబ్ కింగ్స్ )) – 14 మ్యాచ్‌లు, 19 వికెట్లు 5. రషీద్ ఖాన్ (సన్‌రైజర్స్) – 14 మ్యాచ్‌లు, 18 వికెట్లు

Also Read: IPL 2021 Orange Cap: జోరు తగ్గని కేఎల్ రాహుల్‌.. లీగ్‌ నుంచి నిష్ర్కమించినా అగ్రస్థానంలోనే.. వచ్చే ఏడాది పంజాబ్‌కు గుడ్ బై చెప్పనున్నాడా?

RCB vs KKR Eliminator Result: ఉత్కంఠ పోరులో చేతులెత్తేసిన బెంగుళూరు.. క్వాలిఫయర్‌కు చేరిన కేకేఆర్..