దేశంలో కోవిద్ వైరస్ నిర్మూలన ఎప్పుడు..? ఇన్ ఫ్లుయెంజాలా మారుతుందా..? ఏటా వ్యాక్సినేషన్ తప్పదా ?

దేశంలో కరోనా వైరస్ నిర్మూలన పూర్తిగా ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. కొంతకాలానికి ఇది సుమారు వంద సంవత్సరాల నాటి ఇన్ ఫ్లుయెంజాలా మారే సూచనలు ఉన్నాయని...

దేశంలో కోవిద్ వైరస్ నిర్మూలన ఎప్పుడు..? ఇన్ ఫ్లుయెంజాలా మారుతుందా..? ఏటా వ్యాక్సినేషన్ తప్పదా ?
Coronavirus
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 10, 2021 | 1:37 PM

దేశంలో కరోనా వైరస్ నిర్మూలన పూర్తిగా ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. కొంతకాలానికి ఇది సుమారు వంద సంవత్సరాల నాటి ఇన్ ఫ్లుయెంజాలా మారే సూచనలు ఉన్నాయని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఏటా వ్యాక్సిన్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చునని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కి చెందిన డాక్టర్ సమరిన్ పాండా అన్నారు ఫ్లూ గా వ్యవహరించే ఈ వ్యాధి దాదాపు వంద ఏళ్ళ క్రితం ఎలావ్యాప్తమైందో అందరికీ తెలిసిందే అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడిది రెగ్యులర్ డిసీజ్ కావచ్చు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు, వృద్దులు ఏటా ఇందుకు వ్యాక్సిన్ తీసుకొనవలసిన అవసరం ఏర్పడవచ్చు అని ఆయన చెప్పారు. తాము ముఖ్యంగా ఇదే సూచిస్తున్నామని అంటువ్యాధుల నివారణ నిపుణుడు కూడా అయిన ఈయన వెల్లడించారు.ఈ వ్యాధి వైరస్ మ్యుటెంట్ అవుతుంటుందని, అందువల్ల వ్యాక్సిన్ లో స్వల్ప మార్పులు చేస్తున్నామని, ఈ కారణంగా ఆందోళన అనవసరమని ఆయన చెప్పారు.

కొత్త వేరియంట్లను ప్రస్తుత వ్యాక్సిన్లు ఎదుర్కొనవచ్చునని ఆయన అన్నారు. అయితే వేర్వేరు వేరియంట్లకు వేర్వేరు తరహాలో టీకామందుల సామర్థ్యం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాలోకి ఇతర వ్యాక్సిన్లు వచ్చేవరకు వేచి ఉండకుండా ప్రజలు ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకామందులను తీసుకోవాలని పాండా సూచించారు. త్వరలో మరిన్ని వ్యాక్సిన్లు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడెర్నా, ఫైజర్ తదితర వ్యాక్సిన్ల గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని చెప్పజాలమన్నారు. ఆంక్షల ఎత్తివేత ఫలితంగా కేసులు పూర్తిగా తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది అంతానికి కనీసం 93 కోట్లమంది ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్య,మని ఆయన పునరుద్ఘాటించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Ministers: నారాయణపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు..

Afghanistan Violence: దళాల ఉపసంహరణతో అఫ్గానిస్తాన్‌లో పేట్రేగుతున్న హింస.. ఆందోళన వ్యక్తం చేసిన భారత్!