కోవిద్ మహమ్మారి ముప్పు ఇంకా భయపెడుతూనే ఉంది.. ఆ దేశాల్లోని పరిస్థితిని చూడాలన్న కేంద్రం

ఇండియాలో కోవిద్ సెకండ్ వేవ్ ముప్పు ఇంకా కొనసాగుతోందని, ఇది తగ్గిందని భ్రమ పడరాదని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. రష్యా, బ్రిటన్, యూఎస్ వంటి దేశాల్లో మళ్ళీ ఈ కేసులు పెరుగుతున్నాయని, బంగ్లాదేశ్ లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారని తెలిపింది.

కోవిద్ మహమ్మారి ముప్పు ఇంకా భయపెడుతూనే ఉంది.. ఆ దేశాల్లోని పరిస్థితిని చూడాలన్న కేంద్రం
Covid Cases In India
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 10, 2021 | 1:39 PM

ఇండియాలో కోవిద్ సెకండ్ వేవ్ ముప్పు ఇంకా కొనసాగుతోందని, ఇది తగ్గిందని భ్రమ పడరాదని కేంద్రం ప్రజలను హెచ్చరించింది. రష్యా, బ్రిటన్, యూఎస్ వంటి దేశాల్లో మళ్ళీ ఈ కేసులు పెరుగుతున్నాయని, బంగ్లాదేశ్ లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారని తెలిపింది. కోవిద్ వైరస్ అంతమైనట్టు భావిస్తే తప్పే అవుతుందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ముస్సోరీ వంటి హిల్ స్టేషన్లల్లోనూ, దేశంలోని వివిధ మార్కెట్లలోనూ జనం ఎలాంటి కోవిద్ ప్రొటొకాల్స్ పాటించకుండా పెద్ద సంఖ్యలో వీటిని విజిట్ చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. అనేకమంది కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని, భౌతిక దూరం పాటింపు అసలే లేదని ఆయన చెప్పారు. యూరో 2020 ఫుట్ బాల్ మ్యాచ్ ల అనంతరం బ్రిటన్ లో రోజువారీ కేసులు పెరిగాయన్నారు. అలాగే అమెరికాలో కొన్ని రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదన్న నిబంధనను ఎత్తివేసిన తరువాత క్రమంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వస్తున్నాయన్నారు.

బంగ్లాదేశ్ లో సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ లో కొత్తగా ఇవి పెరిగిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా (నేషనల్) లాక్ డౌన్ ని అక్కడి ప్రభుత్వం విధించింది అని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇంకా సౌత్ కొరియా, ఇండోనీసియా లాంటి దేశాల్లోని పరిస్థితిని కూడా ఆయన వివరించారు. మనం ఇప్పుడు సరిగా వ్యవహరిస్తున్నామా ? తగ్గుతోందనుకుంటున్న కోవిద్ వేవ్ ని మళ్ళీ మనం ఆహ్వానిస్తున్నట్టే అవుతోంది అని అయన వ్యాఖ్యానించారు. దేశంలో గత 24 గంటల్లో 43 వేలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయన్నారు. ఇటీవల ఇది సుమారు 37 వేలకేసులు మాత్రమే ఉన్న విషయాన్ని లవ్ ఆర్వాల్ పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: దేశంలో కోవిద్ వైరస్ నిర్మూలన ఎప్పుడు..? ఇన్ ఫ్లుయెంజాలా మారుతుందా..? ఏటా వ్యాక్సినేషన్ తప్పదా ?

ఈ దేశాలలో మన రూపాయి విలువ ఎక్కువే.. తక్కువ డబ్బుతో ఎక్కువగా రోజులు ఎంజాయ్ చేయ్యొచ్చు.. ఎక్కడంటే..

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్