Afghanistan Violence: దళాల ఉపసంహరణతో అఫ్గానిస్తాన్‌లో పేట్రేగుతున్న హింస.. ఆందోళన వ్యక్తం చేసిన భారత్!

అఫ్గానిస్తాన్‌లో హింస పెరుగుతుండడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే హింసను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరింది.

Afghanistan Violence: దళాల ఉపసంహరణతో అఫ్గానిస్తాన్‌లో పేట్రేగుతున్న హింస.. ఆందోళన వ్యక్తం చేసిన భారత్!
Union Minister Jaishankar On Afghanistan
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 10, 2021 | 1:25 PM

Afghanistan Violence: అఫ్గానిస్తాన్‌లో హింస పెరుగుతుండడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే హింసను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. ఆ దేశాన్ని ఎవరు పాలించాలనే విషయంలో చట్టబద్ధత’ను కూడా ముఖ్యమైన అంశంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అఫ్గానిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మాస్కోలో శుక్రవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్‌తో సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ ఆధీనంలో 85% అఫ్గాన్‌ భూభాగం ఉందని శుక్రవారం తాలిబన్‌ ప్రకటించింది. 30 ఏళ్లుగా అఫ్గాన్‌లో శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని జైశంకర్‌ చెప్పారు. రష్యా విదేశాంగ మంత్రితో సంతృప్తకరంగా చర్చలు జరిగాయని తెలిపారు.

మరోవైపు, ఆగస్ట్‌ 31 వరకు అఫ్గానిస్తాన్‌లో తమ మిలటరీ మిషన్‌ పూర్తవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. 20 ఏళ్లుగా అఫ్గాన్‌లో అమెరికా చేపట్టిన సైనిక కార్యక్రమానికి లక్ష కోట్ల డాలర్ల వరకు ఖర్చు అయిందన్నారు. దాదాపు 2,448 మంది అమెరికాకు చెందిన సైనికుల ప్రాణాలను కోల్పోయామన్నారు. కాగా, 20 వేల మందికి పైగా యూఎస్ జవాన్లకు గాయాల పాలయ్యారని బైడెన్‌ వివరించారు. మరో తరం అమెరికన్లను అఫ్గానిస్తాన్‌కు పంపించబోమన్నారు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకుంటారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి దిగజారుతోందని పాకిస్తాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ సివిల్‌ వార్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చింది.

Read Also…  MLA Ramanaidu: అధికారి వస్తారని ఎమ్మెల్యే నిరీక్షణ.. అధికారంలో లేకపోతే అంత అలుసా.. పాలకొల్లు ఎమ్మెల్యేకు చేదు అనుభవం