AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోదసి యానం చేయనున్న ఆ ‘పెద్ద మనిషి’ వంశానికి ఇండియాతో లింక్ ! ఎవరాయన ?

బ్రిటిష్ బిలియనీర్, వర్జిన్ గ్రూప్ ఫౌండర్ కూడా అయిన 70 ఏళ్ళ రిచర్డ్ బ్రాన్ సన్ రేపు వ్యోమగామిగా అంతరిక్ష యానం చేయనున్నాడు. ఆయన వంశస్తులకు ఇండియాతో అవినాభావ సంబంధాలు ఉన్నాయన్న విషయం బయటపడింది. 1793 ప్రాంతంలో తన పాత తరలవారు తమిళనాడులోని

రోదసి యానం చేయనున్న ఆ 'పెద్ద మనిషి' వంశానికి ఇండియాతో లింక్ ! ఎవరాయన ?
Billionaire Richard Branson Has Indian Connection,us,virgin Atlantic,spaceflight,india,cuddulore,tamilnadu Connection
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 10, 2021 | 6:29 PM

Share

బ్రిటిష్ బిలియనీర్, వర్జిన్ గ్రూప్ ఫౌండర్ కూడా అయిన 70 ఏళ్ళ రిచర్డ్ బ్రాన్ సన్ రేపు వ్యోమగామిగా అంతరిక్ష యానం చేయనున్నాడు. ఆయన వంశస్తులకు ఇండియాతో అవినాభావ సంబంధాలు ఉన్నాయన్న విషయం బయటపడింది. 1793 ప్రాంతంలో తన పాత తరలవారు తమిళనాడులోని కడలూరుకు చెందినవారని తెలిసిందని వెల్లడించారు. తన గ్రేట్..గ్రేట్..గ్రేట్ గ్రాండ్ మదర్ అరియా భారతీయురాలేనని…నాడు ఆమె ఇండియన్ ని పెళ్లి చేసుకుందని ఆయన చెప్పాడు. తన వర్జిన్ అట్లాంటిక్ కొత్త రూట్ ని ముంబైకి కనెక్ట్ చేసేందుకు ఈయన 2019 లో ఆ నగరానికి వచ్చాడు. తన నాలుగు పాత తరాలు కడలూరులో నివసిస్తూ వచ్చినట్టు రిచర్డ్ చెప్ప్పడం విశేషం. ఎప్పుడు తాను ఓ ఇండియన్ ని కలిసినా మనం బంధువులమై ఉండవచ్చు అనేవాడినని ఆయన పేర్కొన్నాడు.తన ఇదివరకటి గ్రాండ్ మదర్ పేరిట వర్జిన్ అట్లాంటిక్ గ్రూప్ లోని కొత్త విమానానికి ఈయన ఆమె పేరే పెట్టుకున్నాడట..

నా అంతరిక్షయానం గురించి నా తల్లికి చెప్పినప్పుడు నీ ఆశయం తప్పకుండా నెరవేర్చుకో.. ఆ పట్టు వదలవద్దు.. అని ఆమె చెప్పేది.. ఇన్నాళ్లకు నా కల నెరవేరే వాస్తవం సమీపిస్తోంది అని రిచర్డ్ బ్రాన్ సన్ చెప్పాడు. వీఎస్ఎస్ యూనిటీ పేరిటగల స్పేస్ ఫ్లయిట్ లో రిచర్డ్ తో బాటు ఆంధ్రా అమ్మాయి శిరీష బండ్ల కూడా రోదసియానం చేయనుంది. వీరంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇప్పటికే స్పేస్ సూట్లతో సహా అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి  : Kathi Mahesh Death: కత్తి మహేష్ కన్నుమూత..టాలీవుడ్ విషాదం (Watch Live).

 రజినీకాంత్ లా చేద్దామనుకున్నాడు..కానీ ఇలా ఇరుక్కుపోయాడు.తలైవా‏ను కాపీ కొట్టడం అంత సులువు కాదు అంటూ కామెంట్స్ :Viral Video.

 మాస్క్ లేదంటే బాదుతున్న బుడ్డోడు..! పట్టించుకోని పర్యాటకులు..వైరల్ అవుతున్న చిన్నారి వీడియో :Little Boy In Dharamshala Video.

 Poisonous Snakes dowry : వింత ఆచారం..వరకట్నంగా 21 విష సర్పాలు! కూతురి పెళ్లి చేస్తే మామగారుఇవ్వాలంట..వైరల్ వీడియో.