Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్.. తెరపైకి మల్లికార్జున్ ఖర్గే పేరు.. నేటితో..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజగా కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు కనిపించబోతుందని తెలుస్తోంది.

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్.. తెరపైకి మల్లికార్జున్ ఖర్గే పేరు.. నేటితో..
Mallikarjun Kharge
Follow us

|

Updated on: Sep 30, 2022 | 9:53 AM

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. తాజగా కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. దీంతో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు కనిపించబోతుందని తెలుస్తోంది. శుక్రవారంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్‌ నేడు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. కానీ.. తాజాగా అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మల్లిఖార్జున్ ఖర్గే సైతం నేడు అధ్యక్ష ఎన్నికల బరిలోనిలిచేందుకు నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియాగాంధీతో గురువారం అర్థరాత్రి ఖర్గే ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఖర్గే అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అయిన మల్లికార్జున్ ఖర్గే నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

దిగ్విజయ్ vs శశిథరూర్.. తెరపైకి మరికొందరి పేర్లు..

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు నేడు చివరిరోజు కావడంతో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం,కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్‌, శశిథరూర్ కూడా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. తాజాగా కొత్తగా మరికొందరు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మల్లికార్జున ఖర్గేతోపాటు.. ముకుల్ వాస్నిక్, మీరా కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కాగా.. అధిష్టానం నిర్ణయం ప్రకారం అభ్యర్థలు పోటీలో ఉంటారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే, అంతకుముందు పంజాబ్ సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్ వేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. పంజాబ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో గెహ్లాట్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు సోనియా గాంధీకి క్షమాపణలు తెలియజేశారు. ఈ క్రమంలో పంజాబ్ లో సీఎం పదవిపైకూడా అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

అక్టోబర్ 17న కాంగ్రెస్ ఎన్నికలు..

  • కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం..
  • ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సెప్టెంబర్ 30 చివరితేది.
  • నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 1 న జరుగుతుంది.
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8గా నిర్ణయించారు.
  • ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17 న జరుగుతాయి.
  • ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన అక్టోబర్ 19న ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..