నాకు రిప్లై ఇవ్వకపోతే నీపని అంతే.. హీరోయిన్ ఫొటోకు నెటిజన్ షాకింగ్ కామెంట్
సోషల్ మీడియాలో నిత్యం హీరోయిన్స్ ఫోటోలు, వీడియోలు పదుల సంఖ్యలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అభిమానులు తన అభిమాన హీరోయిన్ ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్స్ కూడా ఫ్యాన్స్ ను కవ్వించేలా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

హీరియిన్స్ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. సినిమాల్లో కొద్దిసేపే కనిపించిన తమ నటనతో ఆకట్టుకునే ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో మాత్రం తమ అందాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంటారు. ఇక రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తూ ఉంటారు హీరోయిన్స్. ఇక సోషల్ మీడియాలో ఒకొక్క హీరోయిన్ పేరు మీద వందకు పైగా ఫ్యాన్ పేజ్‌లు ఉంటాయి. హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు ఫోటోలు షేర్ చేస్తారా అని ఈగర్ గా ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. అయితే చాలా మంది హీరోయిన్ అవకాశాల కోసం గ్లామర్ గేట్లు కూడా ఎత్తేస్తుంటారు లెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో మెప్పిస్తూ ఉంటారు. రీసెంట్ గా ఓ క్రేజీ బ్యూటీ కూడా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అందరు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసిన ఆ బ్యూటీ క్రేజీ కామెంట్స్ వచ్చాయి. అందులో ఓ నెటిజన్ నా కామెంట్‌కి రిప్లై ఇవ్వకపోతే నీకు సినిమాల్లో చాన్సులు రావు అని కామెంట్ చేశాడు. ఇంతకు ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? ఆమె క్రేజీ బ్యూటీగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న నేహా శెట్టి. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అమ్మడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. అలాగే డీజే టిల్లు సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన అందాలతో మెప్పించింది.
ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ చిన్నదానికి అంతగా క్రేజ్ రాలేదు. దాంతో మెల్లగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గాయి. దాంతో సోషల్ మీడియాలో ఎక్కవగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఈ సమ్మర్ లో కుర్రాళ్లకు ఇంకా సెగలు పుట్టిస్తుంది. తాజాగా కొన్ని క్రేజీ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలకు కుర్రాళ్లకు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. సూపర్, బ్యూటీఫుల్ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే ఓ నెటిజన్ మాత్రం నా కామెంట్‌కి రిప్లై ఇవ్వకపోతే నీకు సినిమాల్లో చాన్సులు రావు అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి మనోడికి నేహా రిప్లై ఇస్తుందేమో చూడాలి.
View this post on Instagram
నేహా శెట్టి ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..