సమంత ఫోన్‌లో 'లవ్' పేరుతో కాంటాక్ట్ నంబర్.. ఎవరిదో తెలుసా?
21 March 2025
Rajeev
సినిమాలు చేసినా, చేయకపోయినా ఏదో ఒక విషయంతో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.
తెలుగులో ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేసి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీసుల్లోనే ఎక్కువగా నటిస్తోంది సామ్.
గతేడాది సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ లో నటిస్తోంది.
ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, సిటాడెల్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్ - డీకేనే ఈ వెబ్ సిరీస్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక సమంత నిర్మాతగా వ్యవహరిస్తోన్న మొదటి సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే సమంతకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
అదేంటంటే, సమంత ఫోన్‌లో లవ్ అనే పేరుతో ఒక నెంబర్ సేవ్ అయి ఉందట. అది ఎవరిదా అని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆ నెంబర్ మరెవరిదో కాదట.. సమంత వాళ్ల నాన్నది. సామ్ అమితంగా ప్రేమించే ఆయన గతేడాది నవంబర్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే
క్లిక్ చేయండి..