కేజీ కజ్జికాయలు రూ.50 వేలా.. నోరెళ్లబెట్టిన నెటిజన్లు వీడియో
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రజలంతా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకల్లో మునిగితేలారు. ఇక హోలీ వేళ.. నోరు తీపి చేసుకునేందుకు పక్కాగా స్వీట్ ఉండాల్సిందే..! ఈ క్రమంలో మార్కెట్లో రకరకాల స్వీట్లు సిద్ధమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఓ దుకాణదారు తయారుచేసిన కజ్జికాయలు నోరూరిస్తున్నాయి. కానీ, వాటి ధర చూసి కస్టమర్లు అవాక్కవుతున్నారు. అవును మరి, ఆ కజ్జికాయల ధర కేజీ రూ.50వేలట. ఎందుకు.. బంగారంతో ఏమైనా తయారుచేశారా? అంటే అవుననే అంటున్నారు ఆ యజమాని. 24 క్యారెట్ల పుత్తడితో చేసిన ఈ మిఠాయిలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని గోండాలో హోలీ సందర్భంగా ఓ స్వీట్ దుకాణదారు బంగారు కజ్జికాయలు తయారు చేసి అమ్మకానికి పెట్టారు. వీటి ధర కేజీ రూ.50వేలు అని బోర్డు పెట్టారు. ఒక్క స్వీటు చాలనుకుంటే దానికి రూ.1300లకు చెల్లించాలి. ఆ కజ్జికాయలపైన 24 క్యారెట్ల బంగారు పూత పూయడంతో పాటు అందులో ప్రత్యేకమైన డ్రైఫ్రూట్స్‌ను నింపినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ మిఠాయిల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు లఖ్‌నవూలోని మరో స్వీట్ షాపు దేశంలోనే అతిపెద్ద కజ్జికాయను తయారు చేసి రికార్డు సృష్టించింది. ఆరు కేజీల బరువుతో 25 అంగాళాలు పొడవు ఉన్న ఈ కజ్జికాయ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటర్ తెలిపారు. మునపటి రికార్డులను ఈ కజ్జికాయ బద్దలుకొట్టిందని వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమ్‌ఇండియాకు అభినందనలు తెలుపుతూ ఈ మిఠాయిని మువ్వన్నెల రంగుల్లో ప్రత్యేకంగా తయారు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి ఏమైందంటే?
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..వీడియో