AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Drinks Truck: తిరగబడ్డ కూల్ డ్రింక్స్ లారీ.. గాయపడిన వారిని పట్టించుకోకుండా.. ఫేస్‌కి మాస్క్ వేసుకుని మరీ ఎగబడిన జనం..

యువతతో పాటు వృద్ధులు కూడా కూల్ డ్రింక్ బాటిళ్లు తీసుకోవడానికి నానా తంటాలు పడ్డారు. కొందరు బైక్‌లపై బాటిల్ ట్రేలను పెట్టుకుని.. మరికొందరు బస్తాలతో బాటిళ్లను తీసుకెళ్లారు. అయితే ఇంకొందరు ఒక అడుగు ముందుకు వేసి.. తమని ఎవరూ గుర్తించకుండా..

Cold Drinks Truck: తిరగబడ్డ కూల్ డ్రింక్స్ లారీ.. గాయపడిన వారిని పట్టించుకోకుండా.. ఫేస్‌కి మాస్క్ వేసుకుని మరీ ఎగబడిన జనం..
Kolhapur Truck Accident
Surya Kala
|

Updated on: Feb 05, 2023 | 7:57 AM

Share

కూల్ డ్రింక్స్ లోడ్‌తో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈఘటన మహారాష్ట్ర లోని కర్వీర్ తాలూకాలోని పిరాచివాడి ప్రాంతంలో జరిగింది. పుయిఖాడి సమీపంలోని కొల్హాపూర్ నుంచి గోవ్యాచ్య వైపు వెళ్తున్న కూల్ డ్రింక్స్ లారీ అర్ధరాత్రి పుయిఖాడీ ఘాట్‌ వద్ద బోల్తా పడింది. దీంతో లారీలోని కూల్ డ్రింక్స్ బాటిళ్లు రోడ్డుకి ఇరువైపులా పడిపోయాయి. ప్రమాద ఘటనను పరిశీలించి గ్రామస్తులు, అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు సాయం చేయడం మానేసి.. కూల్ డ్రింక్స్ బాటిళ్లు ఎవరికి దొరికిన కాడికి దోచుకెళ్లేందుకు పోటీ పడ్డారు.

కూల్ డ్రింక్స్ లారీ పడింది అన్న వార్త గ్రామంలో గాలివానలా వ్యాపించడంతో భారీగా జనం ఘటనా స్థలానికి చేరుకున్నారు. శీతల పానీయాల బాటిళ్లను తీసుకెళ్లేందుకు బైక్‌లపై ప్రత్యక్షమయ్యారు.  కూల్ డ్రింక్ బాటిల్స్ ను ఏరుకోవడానికి పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. యువతతో పాటు వృద్ధులు కూడా కూల్ డ్రింక్ బాటిళ్లు తీసుకోవడానికి నానా తంటాలు పడ్డారు. కొందరు బైక్‌లపై బాటిల్ ట్రేలను పెట్టుకుని.. మరికొందరు బస్తాలతో బాటిళ్లను తీసుకెళ్లారు. అయితే ఇంకొందరు ఒక అడుగు ముందుకు వేసి.. తమని ఎవరూ గుర్తించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని.. నోటికి రుమాలు కట్టుకుని బస్తాలతో కూల్ డ్రింక్స్ ను పట్టుకుని  పారిపోయారు

కొద్దిసేపటికే లారీ కూల్ డ్రింక్స్ మొత్తం లూటీ చేశారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే వారిని పట్టించుకోకుండా కూల్ డ్రింక్స్ ఎత్తుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు స్థానికులు. ఘటనపై సమాచారం అందుకున్న పోలిసులు స్పాట్ కి చేరుకొని లారీని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..