AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helicopter Factory: మేడిన్ ఇండియా హెలికాప్టర్లు తయారీ కేంద్రం.. జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ

రక్షణరంగంలో ఆత్మనిర్భరత దిశగా మరో ముందడుగు పడుతోంది. కర్ణాటకలోని తుముకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ రేపు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు.

Helicopter Factory: మేడిన్ ఇండియా హెలికాప్టర్లు తయారీ కేంద్రం.. జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ
Pm Modi
Sanjay Kasula
|

Updated on: Feb 05, 2023 | 9:48 AM

Share

దేశంలోని అన్ని హెలికాప్టర్ల అవసరాలను తీర్చే వన్ స్టాప్ సొల్యూషన్‌ లక్ష్యంగా కర్నాటకలోని తుముకూరులో 615 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌ఫీల్డ్ హెలికాప్టర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హెచ్ఏఎల్  ఫ్యాక్టరీని ప్రారంభించి.. జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. భారత్‌లోనే అతిపెద్ద హెలికాప్టర్ తయారీ సౌకర్యాలు కలిగిన ఈ ఫ్యాక్టరీలో మొదట లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు తయారు చేయనున్నారు. ఈ హెల్‌యూహెచ్‌లు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసింది. ఇందులో 3-టన్ క్లాస్, సింగిల్ ఇంజన్ మల్టీపర్సర్ యుటిలిటీ హెలికాప్టర్‌గా అభివృద్ధి చేయనున్నారు. ప్రతి సంవత్సరం 30 హెలికాప్టర్ల వరకూ తయారు చేసి.. దశలవారిగా ఏడాదికి 60 నుంచి 90 వరకూ తయారు చేస్తారు. తొలి ఎల్‌యూహెచ్‌కు ఫ్లైట్ టెస్ట్ పూర్తి చేసి, ఆవిష్కరణకు సిద్ధం చేశారు.

ఈ ఫ్యాక్టరీలో క్రమంగా లైట్ కంబాట్ హెలికాప్టర్లు, ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్లలను తయారు చేయనున్నారు. దాంతోపాటు మెయింటనెన్స్, రిపైర్‌ వంటివి చేపడతారు. సివిల్ ఎల్‌యూహెచ్‌ల ఎగుమతులు కూడా చేపట్టనున్నారు. రాబోయే 20 ఏళ్లలో 3 నుంచి 15 టన్నుల రేంజ్‌లో వెయ్యికి పైగా విమానాలను తయారు చేయడం ద్వారా 4 లక్షల కోట్ల వ్యాపారానికి HLA ప్లాన్ చేస్తోంది.

దీనికితోడు సీఆర్ఎస్ కార్యకలాపాలు, కమ్యూనిటీ సెంట్రిక్ కార్యక్రమాల్లోనూ కంపెనీ గణనీయంగా పెట్టుబడులు పెట్టడం వల్ల తుముకూరు చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఫలితంగా ఆ ప్రాంత ప్రజల జీవనవిధానం మరింత మెరుగుపడనుంది. స్కూళ్లు, కాలేజీలు, రెసిడెన్షియల్ ఏరియాల్లో స్కిల్, ఇన్‌ఫ్రాస్టక్చర్ డవలప్‌మెంట్ చోటుచేసుకుంటుంది. సమీప ప్రాంతాల వారికి మరిన్ని వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం