RSS with Adani: ఆస్ట్రేలియాలో గౌతమ్ అదానీని టార్గెట్ చేసేందుకు కుట్ర..స్పందించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
అదానీ గ్రూప్ పై దాడి ఇవాళ్టిది కాదు. ఏడేళ్ల నాటి నుంచి ఉంది. హిండెన్ బర్గ్ కన్నా ముందునుంచే ఉంది. ఇదీ ఆర్ఎస్ఎస్ చేస్తోన్న హాట్ కామెంట్.
అదానీ గ్రూప్ వ్వాపారాలపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ను ఒక కుదుపు కుదిపేస్తోంది. అదానీ గ్రూప్ షేర్లలో దాదాపు అన్నీ పతనమయ్యాయి. మార్కెట్ ఒడుదొడుకుల నడుమ FPOను సైతం ఉపసంహరించుకుంది అదానీ ఎంటర్ ప్రైజెస్. మరోవైపు ఈ వ్యవహారం పార్లమెంటునూ తాకింది. హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాల్సిందేనని పట్టుబడుతున్నాయి విపక్షాలు. ఈ వ్యవహారంపై స్పందించింది ఆర్ఎస్ఎస్. అదానీ గ్రూప్ నకు మద్దతుగా నిలిచింది. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ ఉద్దేశపూర్వక దాడిగా అభివర్ణించింది. ఈ మేరకు సంఘ్ అధికారిక వెబ్ సైట్ ఆర్గనైజర్ లో ఒక కథనం ప్రచురించింది.
షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్.. ఇచ్చిన నివేదికను అనుసరించి.. ఒక వర్గానికి చెందిన వారు వ్యతిరేక ప్రచారం ప్రారంభించారని ఆరోపించింది ఆర్గనైజర్. అదానీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో వామపక్ష భావజాలంతో కూడిన కొన్ని వెబ్ సైట్లు, వ్యక్తులున్నారని ఆరోపించింది.
అదానీపై దాడి జనవరి 25న మొదలు కాలేదనీ.. 2016-17లో ఆస్ట్రేలియాలోనే బీజాలు పడ్డాయని ఆరోపించింది. ఆస్ట్రేలియాకు చెందిన బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ కి చెందిన ఒక అనుకూల వెబ్ సైట్.. అదానీని దెబ్బ తీయడానికి కథనాలు ప్రచురించిందని కామెంట్ చేసింది ఆర్గనైజర్. ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గు గనుల ప్రాజెక్టుపై వ్యతిరేకతతో ప్రారంభమైన ఈ వెబ్ సైట్.. అదానికి సంబంధించిన ప్రతి ప్రాజెక్టు గురించి రాస్తోందని ఆరోపించింది ఆర్గనైజర్. అదానీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీయడమే దీని లక్ష్యమని అంటోంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.
మరిన్ని జాతీయ వార్తల కోసం