CM KCR: దారులన్నీ మరఠ్వాడా వైపే.. బీఆర్ఎస్ సభకు సిద్ధమైన నాందేడ్ పట్టణం.. సీఎం కేసీఆర్ టార్గెట్ అదేనా..

BRS Nanded Meeting: దేశ రాజకీయాల్లో సత్తా చాటేందుకు, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది.

CM KCR: దారులన్నీ మరఠ్వాడా వైపే.. బీఆర్ఎస్ సభకు సిద్ధమైన నాందేడ్ పట్టణం.. సీఎం కేసీఆర్ టార్గెట్ అదేనా..
CM KCR
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 05, 2023 | 6:40 AM

BRS Nanded Meeting: దేశ రాజకీయాల్లో సత్తా చాటేందుకు, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ఖమ్మం సభతో దేశం చూపును తన వైపు తిప్పుకున్న బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. ఇవాళ మరో సభకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ పార్టీ రెండు లక్షలమందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. జాతీయ పార్టీగా ఆవర్భవించాక.. పొరుగు రాష్ట్రంలో నిర్వహిస్తున్న మొదటి సభ ఇదే కావడం విశేషం. 2024 ఎన్నికలే టార్గెట్ గా సీఎం కేసీఆర్ నాందేడ్ సభలో ప్రసంగించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై కూడా మాట్లాడున్నట్లు తెలుస్తోంది. నాందేడ్ జిల్లాలోని సౌత్, నార్త్, బోకర్, నాయిగాం. ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్పట్, ధర్మాబాద్ మండలాల నుంచి భారీ జనసమీకరణ చేశారు. వీటితో పాటు.. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఆదిలాబాద్, బోథ్, మథోల్, నిర్మల్, నిజామాబాద్, బోధన్ నియోజవర్గాల నుంచి నాందేడ్ సభకు గులాబీ శ్రేణులు ఇప్పటికే తరిలాయి. రెండు లక్షల మంది పాల్గొనేలా.. సభా ప్రాంగణాన్ని తీర్చి దిద్దారు. దీంతో ఈ ప్రాంతంలో దారులన్నీ నాందేడ్ వైపే కదులుతున్నాయ్. ఫ్లెక్సీలు, తోరణాలతో నాందేడ్ పూర్తి గులాబీ మయంగా మారిపోయింది.

నాందేడ్ సభకు.. కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమాన్, ఎమ్మెల్యేలు జోగి రామన్న, షకీల్.. టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్.. కొన్నాళ్లుగా ఇక్కడే ఉండి.. సభా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

వారం రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసిన ఇంద్రకరణ్ రెడ్డి.. అందరినీ సమన్వయం చేస్తూ.. అన్నీ తానై నడిపిస్తున్నారు. ఇటు ఏర్పాట్లు చూస్తూనే, అటు గ్రామాల్లో సర్పంచ్ లు ఇతర ప్రజా ప్రతినిథులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తూ.. సభ విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. దేశ ప్రగతి కోసం, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంలో భాగంగా.. బీఆర్ఎస్ ఒక ప్రత్యామ్నయ శక్తిగా చెబుతూ.. పార్టీని ఆదరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..