రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుంటే అధికారం నుంచి వైదొలగండి.. కేంద్ర ప్రభుత్వం పై సంచలన కామెంట్స్ చేసిన ముఖ్యమంత్రి..

ఎముకలు కొరికే చలిలో గత పన్నెండు రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సంపూర్ణ మద్దతును తెలిపారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకుంటే అధికారం నుంచి వైదొలగండి.. కేంద్ర ప్రభుత్వం పై సంచలన కామెంట్స్ చేసిన ముఖ్యమంత్రి..
Follow us

|

Updated on: Dec 07, 2020 | 7:40 PM

ఎముకలు కొరికే చలిలో గత పన్నెండు రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సంపూర్ణ మద్దతును తెలిపారు. పార్టీ సభ్యులందరికి రైతులు తలపెట్టిన భారత్ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం పశ్చిమ మిడ్నాపూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రైతుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని లేదంటే అధికారం నుంచి దిగిపోవాలని అన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న అధికార దుర్వినియోగంపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని హెచ్చరించారు. ఒకవేళ మీరు నాపై కక్ష కట్టి కేసులు నమోదుచేసినా జైలు కెళ్లేందుకు కూడా సిద్దమని ప్రకటించారు. అంతేకాకుండా పశ్చిమబెంగాల్‌లో బీజేపీ లాంటి పార్టీని ప్రజలు ఆదరించరని, అందుకు ఇక్కడి ప్రజలు సిద్దంగా లేరని పేర్కొన్నారు. కాగా రైతుల మద్దతుకు అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. దీంతో రైతుల బంద్‌ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించనుంది.