Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Race: సీఎం ఎవరన్నది సస్పెన్స్‌.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కొనసాగుతున్న ఉత్కంఠత

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ బెల్ట్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. దీని తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది. మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి రేసులో బీజేపీ చెందిన ప్రముఖులు ఉన్నారు.

CM Race: సీఎం ఎవరన్నది సస్పెన్స్‌.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కొనసాగుతున్న ఉత్కంఠత
Bjp Cm Face
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 09, 2023 | 11:39 AM

ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందీ బెల్ట్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. దీని తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది. మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి రేసులో బీజేపీకి చెందిన ప్రముఖులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తుది నిర్ణయం తీసుకోవడానికి పార్టీ పరిశీలకులను నియమించింది. రాజస్థాన్ పరిశీలకుడిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నియమితులయ్యారు.

మధ్యప్రదేశ్‌కు సంబంధించి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు పరిశీలకుల బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరు నేతలతో పాటు మరికొందరు సీనియర్ నేతలకు పార్టీ పరిశీలకుల బాధ్యతలు అప్పగించింది. ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించి కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్‌లకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ పరిశీలకులు ఆయా రాష్ట్రాల్లో ముఖమంత్రి ఎవరనేదీ నిర్ణయిస్తారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో ఎవరున్నారు?

ప్రస్తుతం రాజస్థాన్‌లో ముఖ్యమంత్రిగా వసుంధర రాజే, కిరోరి లాల్ మీనా, బాబా బాలక్‌నాథ్, గజేంద్ర సింగ్ షెకావత్, దియా కుమారి పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. శాసనసభా పక్ష సమావేశంలో అభిప్రాయం తీసుకున్న తర్వాత వీరిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు పార్టీ నేతలు. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం రాజస్థాన్ చేరుకుంటారు. వీరితో పాటు సరోజ్ పాండే, వినోద్ తావ్డే పరిశీలకులుగా రాజస్థాన్ చేరుకోనున్నారు. ఆదివారం నాడు శాసనసభా పక్ష సమావేశం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కూడా డిసెంబర్ 16వ తేదీలోపు జరగొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లో సీఎం రేసులో జ్యోతిరాదిత్య సింధియా

మధ్యప్రదేశ్‌లో సోమవారం ఉత్కంఠతకు తెరపడనుంది. పరిశీలకులుగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యదర్శి ఆశా లక్రా శనివారం లేదా ఆదివారం భోపాల్ చేరుకోవచ్చు. వీరి ముందు సీఎం అభ్యర్థి పదవీకాలం ముగిసిన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు జ్యోతిరాదిత్య సింధియా పేరు బలంగా వినిపిస్తోంది. వీరితో పాటు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, వీడీ శర్మ పేర్లు కూడా రేసులో ఉన్నారు. శివరాజ్‌ను సీఎం చేయకుంటే జ్యోతిరాదిత్య సింధియా పేరు ముందు వరుసలో ఉంది.

ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ రామన్ ప్రభుత్వమేనా?

ఛత్తీస్‌గఢ్‌లో కూడా ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌తో పాటు రేణుకా సింగ్, అరుణ్ సావ్, విష్ణు దేవ్ సాయి, ఓపీ చౌదరి పేర్లు సీఎం పదవికి ముందున్నాయి. ఇక్కడ కూడా ఆదివారం నాడు ముఖ్యమంత్రి పేరుఃను ప్రకటించే అవకాశముంది. దీంతో సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. పరిశీలకులుగా నియమితులైన కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ శనివారం రాయ్‌పూర్ చేరుకోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..