AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Dheeraj Sahu: ఎంపీ సాహు స్థానాల్లో కొనసాగుతున్న నగదు వెలుగుతీసే ప్రక్రియ.. రూ. 300 కోట్లు రికవరీ

బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ప్రాంగణాల నుండి ఆదాయపు పన్ను శాఖ ఈ నగదును రికవరీ చేసింది. పన్ను ఎగవేతపై అనుమానంతో బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కంపెనీ కార్యాలయంలోని అల్మారాలు, మంచాల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ధీరజ్ సాహు బంధువులకు ఒడిశాలో భారీగా మద్యం బిజినెస్ చేస్తూ ఉంటారు. 

MP Dheeraj Sahu: ఎంపీ సాహు స్థానాల్లో కొనసాగుతున్న నగదు వెలుగుతీసే ప్రక్రియ.. రూ. 300 కోట్లు రికవరీ
Mp Dheeraj Sahu
Surya Kala
|

Updated on: Dec 09, 2023 | 10:13 AM

Share

జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకి చెందిన అనేక ప్రాంతాల్లో అక్రమార్జనను వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతోంది. నగదును వెలికి తీస్తూనే ఉన్నారు. ధీరజ్ సాహు సహా అతని బృందంపై  ఆదాయపు పన్ను శాఖ చేసిన దాడిలో ఇప్పటివరకు రూ. 300 కోట్లు రికవరీ చేయబడ్డాయి. అయితే ఈ డబ్బుల కట్టలు పుట్టలోకి పాముల్లా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జార్ఖండ్, ఒడిశా, కోల్‌కతాలో ధీరజ్ సాహు రహస్య స్థావరాలపై దాడులు చేశారు. ధీరజ్ సాహుకు చెందిన అరడజను ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.

బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ప్రాంగణాల నుండి ఆదాయపు పన్ను శాఖ ఈ నగదును రికవరీ చేసింది. పన్ను ఎగవేతపై అనుమానంతో బౌధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కంపెనీ కార్యాలయంలోని అల్మారాలు, మంచాల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ధీరజ్ సాహు బంధువులకు ఒడిశాలో భారీగా మద్యం బిజినెస్ చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం సాహుకి చెందిన స్థావరాలపైనా జరుగుతున్న ఐటీ దాడులపై ఈ మద్యం వ్యాపార సంస్థ ఇంకా  స్పందించలేదు. అయితే ప్రతి పక్ష నేతలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును కోరింది. ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్ (బిజెడి) నుండి కూడా పార్టీ వివరణ కోరింది.

ఇవి కూడా చదవండి

బిజెపి అధికార ప్రతినిధి మనోజ్ మహాపాత్ర ఒడిశాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక మహిళా మంత్రి ఫోటోలను కూడా చూపించారు. అయితే ఆ ఫొటోల్లో సాహు అక్రమాస్తులపై దాడి చేస్తున్నఆదాయపు పన్ను శాఖ దాడులు అధికారుల్లో ఒకరు చేస్తున్న మద్యం వ్యాపారులలో ఒకరితో వేదికను పంచుకున్నట్లు ఉంది. ఈ ఆరోపణలపై బీజేడీ ఎమ్మెల్యే సత్యన్నారాయణ ప్రధాన్ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణను తిరస్కరించారు.  ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అవినీతిని ద్వేషిస్తారని.. పాలనలో పారదర్శకతను విశ్వసిస్తారని  పేర్కొన్నారు.

ప్రధాని మోడీ స్పందన

ధీరజ్ సాహు ప్రాంగణంపై దాడి చేసిన తర్వాత..  కాంగ్రెస్ ఎంపీని ప్రధాని మోడీ లక్ష్యంగా సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ చేశారు. దోచుకున్న సొమ్ము.. ప్రజాధనం అని .. దానిని తిరిగి ఇవ్వాల్సిందేనని ప్రధాని మోడీ ఎక్స్‌లో రాశారు. దేశ ప్రజలు ఈ నోట్ల కుప్పను చూసి.. ఆ తర్వాత తమ నాయకుల నిజాయితీ ‘ప్రసంగాలు’ వినాలని .. ప్రజల నుండి ఏది దోచుకున్నా.. దానిలోని ప్రతి పైసా తిరిగి ఇవ్వవలసి ఉంటుందని మోడీ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..