Tirumala: తిరుమల వెంకన్న సేవలో లాలూ ఫ్యామిలీ.. కేశఖండన చేయించుకుని మొక్కులు తీర్చుకున్న కుటుంబ సభ్యులు
పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న లాలు కుటుంబ సభ్యులకు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు ఏపీ అభిమానులు.. యాదవ సంఘం నాయకులు. భారీ గజమాలలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయంలో లాలూకు తెలంగాణ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. తర్వాత విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు.
తిరుమల శ్రీవారి సేవలో మాజీ సీఎం, అర్.జే.డి నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం తరించింది. లాలూ భార్య రబ్రిదేవి, తనయుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు వేకువ జామున సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుంది. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూతురు కేశఖండన చేయించుకుని మొక్కులు తీర్చుకున్న లాలూ ఫ్యామిలీ దేశం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొంది. లాలూ ప్రసాద్ వెంట తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, స్థానిక యాదవ సంఘం నేతలు ఉండగా టీటీడీ అధికారులు దర్శన ఏర్పాటు చేశారు.
శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ డిఫ్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌కు రేణుగుంట విమానశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న లాలు కుటుంబ సభ్యులకు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు ఏపీ అభిమానులు.. యాదవ సంఘం నాయకులు. భారీ గజమాలలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయంలో లాలూకు తెలంగాణ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ స్వాగతం పలికారు. తర్వాత విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..