Maoists Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. కీలక నేత ఆశన్న సహా 208 మంది లొంగుబాటు
Maoists Surrender: చత్తీస్‌గడ్‌లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేశ్ సహా 208 మంది నక్సలైట్లు శుక్రవారం పోలీసుల ముందు లొంగిపోయారు. తమ దగ్గర ఉన్న ఆయుధాలను కేంద్ర హోంశాఖకు అప్పగించి వారంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.

చత్తీస్‌గడ్‌లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, కేంద్రకమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ రూపేశ్, మావోయిస్టుల కంచుకోట అభూజ్‌మఢ్ ఖాళీ సహా సుమారు 208 మంది నక్సలైట్లు శుక్రవారం బస్తర్ జిల్లాలోని జగ్‌దల్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా తమ దగ్గర ఉన్న సుమారు 153 ఆయుధాలను కేంద్ర హోంశాఖకు అప్పగించి జనజీనవ స్రవంతిలో కలిసిపోయారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ లొంగుబాలుతో కేవలం దక్షిణ బస్తర్ ప్రాంతంలో మాత్రమే మావోయిస్టుల జాడ మిగిలి ఉంది. అయితే ప్రస్తుతం జరిగిన ఈ లొంగుబాటు మావోయిస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటుగా నిలిచింది.
ఈ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు సమర్పించిన ఆయుధాలలో19 ఏకే-47లు, పదిహేడు SLR, ఇరవైమూడు ఇన్సాస్ రైఫిళ్లతో పాటు ముప్పై ఆరు 303-రైఫిళ్లు, 41 సింగిల్ షాట్ గన్స్, పదకొండు బీజీఎల్ లాంఛర్లు, 4 కార్బైన్లు, 1 లైట్ మెషీన్ గన్ ఒక పిస్టల్ ఉన్నాయి. ఇదిలా ఉండగా రెండ్రోజుల క్రితమే మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కూడా తన 60 మంది అనుచరలో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలీలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలోనే ఆశన్న కూడా తొంగిపోతున్నట్టు ప్రకటించారు.
#WATCH | Jagdalpur, Chhattisgarh | A total of 208 Naxalites, along with 153 weapons, have been brought to the Police Lines for surrender and rehabilitation. With this, most of Abujhmad will be free from Naxalite influence pic.twitter.com/iRZC2y84S7
— ANI (@ANI) October 17, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




