AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..

దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భగ్గు మంటున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలతో సమాన్యుడికి బంగారం అందనంత దూరంగా వెళ్తొంది. ప్రస్తుతం తులం ధర లక్షన్నర వైపు పరుగులు పెడుతోంది. తులం ధర ఇప్పుడు లక్షా 30 వేలకు చేరువలో ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి శుక్రవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

Gold Price Today: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం ధరలు..  తులం ఎంతంటే..
ధంతేరాస్‌ రోజు బంగారం, వెండి కొనాలని చాలా మంది అనుకుంటారు. కానీ వారికి సరిగ్గా ఒక్క రోజు ముందు బంగారం భారీ షాక్ ఇవ్వగా వెండి మాత్రం ఊరట నిచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా బంగారం ధర ఒక్క రోజులో రూ. 3,300 పెరిగి రికార్డులు బద్దలు కొట్టంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ. 1,32,770 కి చేరుకుంది.
Anand T
|

Updated on: Oct 17, 2025 | 6:52 AM

Share

Gold Price Today: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు భగ్గు మంటున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ధరలతో సమాన్యుడికి బంగారం అందనంత దూరంగా వెళ్తొంది. ప్రస్తుతం తులం ధర లక్షన్నర వైపు పరుగులు పెడుతోంది. తులం ధర ఇప్పుడు లక్షా 30 వేలకు చేరువలో ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. అయితే గురువారంతో పోల్చుకుంటే శుక్రవారం పసిడి ప్రియులకు కాస్తా ఊరట కలిగిందనే చెప్పవచ్చు.

తాజాగా అక్టోబర్‌ 17న దేశీయంగా బంగారం ధరలు రూ.20 తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430 చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.1,18,640కి చేరుకుంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.1,88,900గా ఉంది. ఇక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో వెండి ధర రూ.2,05,900గా కొనసాగుతుంది. అంటే వెండి కూడా తగ్గేదేలే అనట్టు దూసుకుపోతుంది. తాగా ధరలతో రూ.2లక్షల మార్క్‌ను దాటి రికార్డ్ క్రియేట్‌ చేసింది. రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా మరింతగా పెరిగే అవకాశాల ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 ఉంది.
  2. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,790 ఉంది.
  3. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 ఉంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,830 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,010 ఉంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,430 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 వద్ద కొనసాగుతోంది.

2028 నాటికి రూ.3లక్షలకు చేరనున్న బంగారం ధర

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో మున్ముందు బంగారం ధరలు ఇంకా భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఒ వైపు ఇప్పటికే ఔన్సుకు 4 వేల డాలర్ల మార్కును అధిగమించగా.. దేశీయంగా రూ. 1.30 లక్షలు దాటి ఇంకా పెరుగుతూనే ఉంది. దీని ప్రకారం బంగారం ధర మరింత భారీగా పెరగొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్, ఇవే బంగారానికి మద్దతు కలిగించే అంశాలు కొనసాగితే.. 2028 చివరి నాటికి లేదా 2029 ప్రారంభం కల్లా ఔన్స్ బంగారం ధర రూ. ఏకంగా 10 వేల డాలర్ అంటే భారత్‌లో రూ.3లక్షల దాటొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.