AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandigarh Dispute: హర్యానా, పంజాబ్‌ల మధ్య ముదురుతున్న చండీగఢ్‌ వివాదం.. రెండు రాష్ట్రాలకు రాజధాని ఎలా అయింది?

చండీగఢ్ పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని. దీనిపై మరోసారి వివాదం నెలకొంది.

Chandigarh Dispute: హర్యానా, పంజాబ్‌ల మధ్య ముదురుతున్న చండీగఢ్‌ వివాదం..  రెండు రాష్ట్రాలకు రాజధాని ఎలా అయింది?
Chandigarh Dispute
Balaraju Goud
|

Updated on: Apr 06, 2022 | 8:52 AM

Share

Chandigarh Dispute: చండీగఢ్ పంజాబ్(Punjab), హర్యానా(Haryana) రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని. దీనిపై మరోసారి వివాదం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయమే ఇందుకు కారణమైంది. చండీగఢ్ ఉద్యోగులకు కేంద్రం నిబంధనలు వర్తిస్తాయని తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడే అసలు నిరసన మొదలైంది. పంజాబ్‌లోని చండీగఢ్‌ను అసెంబ్లీలో చేర్చాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీర్మానం చేశారు. అదే సమయంలో, ఛండీగఢ్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

చండీగఢ్ హర్యానాలోని అంబాలా జిల్లాలో భాగమని హర్యానా నాయకులు పేర్కొన్నారు. హర్యానా , పంజాబ్‌లలో చండీగఢ్‌ను రెండు రాష్ట్రాలు తమ సొంతం చేసుకున్నందున విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. హర్యానా, పంజాబ్‌లకు చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా ఎలా మారింది. ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? చండీగఢ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పంజాబ్ ఎన్ని ప్రయత్నాలు చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఒక్కసారి పరిశీలిద్దాం..!

భారతదేశం పాకిస్తాన్ విభజనకు ముందు, పంజాబ్ రాజధాని లాహోర్. లాహోర్ పాకిస్తాన్‌లో భాగమైన తర్వాత 1948 మార్చిలో చండీగఢ్ పంజాబ్ రాజధానిగా ఏర్పాటు అయ్యింది. 1965 వరకు అంతా బాగానే ఉంది. కానీ 1966లో కొత్త రాష్ట్రం ఏర్పాటు చర్చ మొదలైంది. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1 నవంబర్ 1966న ఆమోదించిన తర్వాత హర్యానా, పంజాబ్ నుండి విడిపోయింది. పంజాబ్ నుంచి హర్యానా ఏర్పడిన తర్వాత ఎవరిని రాజధానిగా చేయాలనే ప్రశ్న తలెత్తింది. ఆ సమయంలో, రెండు రాష్ట్రాల సరిహద్దులో నిర్మించిన ఏకైక నగరం చండీగఢ్. దీంతో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం.

చండీగఢ్ రాజధానిగా చేయడానికి సరిహద్దులే కాదు, అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ఇది ఒక వ్యవస్థీకృత నగరం. పరిపాలనా వ్యవస్థను రూపొందించడం నుండి రాజధానిని చేయడం వరకు.. ఈ నగరం ప్రతి ప్రమాణానికి అనుగుణంగా జీవించింది. రాజధాని అయిన తర్వాత, ఈ నగరం ఆస్తిలో 60 శాతం పంజాబ్‌కు, 40 శాతం హర్యానాకు వెళ్లాయి. అదే సమయంలో, కేంద్రపాలిత ప్రాంతంగా.. కేంద్రం కూడా ఈ నగరంపై ప్రత్యక్ష నియంత్రణను కలిగి ఉంది. లోక్‌సభలో సమర్పించిన ప్రభుత్వ పత్రం ప్రకారం, చండీగఢ్ రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న కాలంలో, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మొదట చండీగఢ్ రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుందని, తరువాత పంజాబ్‌లో విలీనం అవుతుందని చెప్పారు. కానీ ఇది జరగలేదు. ఉపసంహరించుకోవాలని చాలాసార్లు ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు.

చండీగఢ్‌ను హర్యానా నుంచి వేరు చేసేందుకు పంజాబ్ అనేక ప్రయత్నాలు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమన్ అరోరా తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. చండీగఢ్‌ను పంజాబ్‌కు ఇవ్వాలని సభలో ఆరుసార్లు ప్రతిపాదన వచ్చిందని చెప్పారు. ఇది మొదటిసారిగా 18 మే 1967న, రెండవ సారి 19 జనవరి 1970న, మూడవసారి 7 సెప్టెంబర్ 1978న, నాల్గొవసారి 31 అక్టోబర్ 1985న, ఐదోవసారి 6 మార్చి 1986న, ఆరవసారి 23 డిసెంబర్ 2014న. తాజాగా, చండీగఢ్‌ను వెంటనే పంజాబ్‌లో చేర్చాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విధానసభలో తీర్మానం చేశారు. అటు, చండీగఢ్ తమకే దక్కుతుందని హర్యానా ప్రభుత్వం సైతం గట్టిగానే పట్టుబడుతోంది.

Read Also…  Sharad Pawar: ఢిల్లీలో శరద్ పవార్ విందు రాజకీయం.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు, సంజయ్ రౌత్, గడ్కరీ సైతం హాజరు!