Agnipath: అగ్నిపథ్ పథకంపై తప్పుడు ప్రచారం.. 35 వాట్సప్ గ్రూపులపై కేంద్ర నిషేధం.. 10 మంది అరెస్ట్

అగ్నిపథ్ పథకం, అగ్నివీర్స్‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం పలు వాట్సాప్ గ్రూపులను ఆదివారం నిషేధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Agnipath: అగ్నిపథ్ పథకంపై తప్పుడు ప్రచారం.. 35 వాట్సప్ గ్రూపులపై కేంద్ర నిషేధం.. 10 మంది అరెస్ట్
Agnipath Scheme
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 20, 2022 | 6:05 AM

Centre bans 35 WhatsApp groups: కేంద్రం అమల్లోకి తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. నిరసనకారులు పలు రైళ్లకు నిప్పంటించడంతో భారీగా ఆస్థినష్టం వాటిల్లింది. అయితే.. ఈ అగ్నిపథ్ పథకంపై కావాలనే కొంతమంది వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ హింసాత్మక ఘటనలపై చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగా అగ్నిపథ్ పథకం, అగ్నివీర్స్‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం పలు వాట్సాప్ గ్రూపులను ఆదివారం నిషేధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు 35 వాట్సాప్ గ్రూపులను ప్రభుత్వం నిషేధించింది. దీంతోపాటు ‘ఫేక్ న్యూస్’ ప్రచారం చేసినందుకు, నిరసనలు జరిపేలా ఉసిగొల్పినందుకు పది మందిని కూడా అరెస్టు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాయుధ బలగాల రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో హింసాత్మక నిరసనలు, రైళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడం లాంటి ఘటనల మధ్య కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఇలాంటి ఘటనలపై వాస్తవ తనిఖీల కోసం పిఐబి ఫ్యాక్ట్ చెక్ టీమ్ నంబర్‌లో 8799711259కి నివేదించాలని కేంద్రం పౌరులను కోరింది.

ప్రభుత్వం మంగళవారం ‘అగ్నిపథ్’ మోడల్ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. దీని ప్రకారం సైనికులను నాలుగు సంవత్సరాల పాటు మూడు సర్వీసుల్లోకి చేర్చుకోనున్నారు. ఎంపిక ప్రక్రియ తర్వాత వారిలో 25 శాతం మందిని అదనంగా 15 సంవత్సరాలు కొనసాగించే నిబంధన సైతం ఉంది. దీంతోపాటు రిజర్వేషన్ కూడా కల్పించనున్నారు. దీనిపై వెనక్కి తగ్గబోమని.. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునేది లేదని త్రివిధ దళాధిపతులు ఆదివారం స్పష్టంచేశారు. దీంతోపాటు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ, హోంమంత్రిత్వ శాఖ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఘటనల తీవ్రత దృష్ట్యా బీహార్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఉప ముఖ్యమంత్రిపై దాడి చేయడంతో బీహార్ వంటి రాష్ట్రాల్లో నిరసనలను సమీకరించడానికి వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారనే నివేదికల మధ్య హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఈ చర్యలు తీసుకుంది. రేణుదేవి ఇల్లు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు బీహార్‌లోని అనేక జిల్లాల్లో సాధారణ జీవితానికి అంతరాయం కలిగించింది.

ఇవి కూడా చదవండి

కాగా.. మూడు రోజుల్లో (జూన్ 15 నుంచి జూన్ 17 వరకు) బీహార్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో సుమారు 620 మందిని అరెస్టు చేశామని, 130 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లు (ఎఫ్‌ఐఆర్‌లు) నమోదయ్యాయని లా అండ్ ఆర్డర్ ఎడిజి సంజయ్ సింగ్ తెలిపారు. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని శనివారం 140 మందిని అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..