Jammu-Kashmir: మరోసారి ఉలిక్కిపడ్డ జమ్మూకశ్మీర్.. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం

ప్రశాంతంగా ఉండే జమ్మూకశ్మీర్(Jammu-Kashmir) మరోసారి ఉలిక్కిపడింది. తుపాకీ చప్పుళ్లతో మరోసారి దద్దరిల్లింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఉగ్రవాదులు, భద్రతా...

Jammu-Kashmir: మరోసారి ఉలిక్కిపడ్డ జమ్మూకశ్మీర్.. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం
Kashmir
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 19, 2022 | 9:14 PM

ప్రశాంతంగా ఉండే జమ్మూకశ్మీర్(Jammu-Kashmir) మరోసారి ఉలిక్కిపడింది. తుపాకీ చప్పుళ్లతో మరోసారి దద్దరిల్లింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ముష్కరులు(Militants) మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకరు పాకిస్తానీ అని, లష్కరే తొయిబా సంస్థ కోసం పనిచేస్తున్నాట్లు అధికారులు గుర్తించారు. షౌకత్ అహ్మద్ షేక్​అనే ఉగ్రవాదిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతడి నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా కుప్వారా జిల్లాలో ప్రత్యేక నిఘా చేపట్టారు. ఉగ్రవాదులు శిబిరాలను చుట్టుముట్టారు. వెంటనే ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకడు లష్కరే తొయిబా కోసం పనిచేస్తున్న పాకిస్థానీ అని ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. కుల్గాం జిల్లా దమ్హల్ హంజీపొరాలో జరిగిన ఘటనలో మరో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. కాగా ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

గతంలోనూ బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ముగ్గురు పాక్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నిర్మానుష్య ప్రదేశాల్లో దాక్కున్న ఉగ్రవాదులు బలగాలను చూసి, వారిపై కాల్పులు జరిపారు. వెంట‌నే అల‌ర్ట్ అయిన‌ సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని పాక్‌కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించిన‌ట్టు ఐజీపీ తెలిపారు. కాగా.. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో జేకేపీ జవాన్‌ వీరమరణం పొందారని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి