Crime News: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. కోడలిని టెర్రస్ పైనుంచి తోసేసిన అత్తమామలు..
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక బిల్డింగ్ టెర్రస్‌పై నుంచి 30 ఏళ్ల మహిళ రోడ్డుపై పడింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉనట్లు వైద్యులు తెలిపారు.
Delhi Crime News: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను అత్తామామలు బిల్డింగ్ బాల్కానీ పైనుంచి కిందకు తోసేశారు. ప్రస్తుతం ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని మయూర్ విహార్ (Mayur Vihar) ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక బిల్డింగ్ టెర్రస్‌పై నుంచి 30 ఏళ్ల మహిళ రోడ్డుపై పడింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉనట్లు వైద్యులు తెలిపారు. కాగా, తన సోదరిని అత్తింటి వారు బిల్డింగ్ టెర్రస్ నుంచి కిందకు తోసెసినట్లు ఆమె సోదరుడు పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)కు షేర్ చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియోలో మహిళను భవనం టెర్రస్‌పై నుంచి తోసేస్తున్న దృశ్యం ఉన్నట్లు సమాచారం.
బాధితురాలి సోదరుడి ఫిర్యాదుపై డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ స్పందించారు. ఈ విషయమై ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తామని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. కాగా.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ తూర్పు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ప్రియాంక కశ్యప్ పేర్కొన్నారు. బాధిత మహిళ అత్తింటి వారిపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..