Secunderabad Incident: ఆవుల సుబ్బారావు వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. అరెస్ట్ కథనాలపై క్లారిటీ ఇచ్చిన జిల్లా ఎస్పీ
Agnipath Protest News: సుబ్బారావు వ్యవహారానికి సంబంధించి తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ తెలిపారు. అలాగే సుబ్బారావును యూపీ పోలీసులు విచారించారన్న వార్తల్లో వాస్తవంలేదన్నారు ఎస్పీ రవిశంకర్.
Secunderabad Railway Station Incident: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసానికి ప్రధాన కారకుడిగా అనుమానిస్తున్న ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు(Avula Subbarao) విషయం కొత్త మలుపు తిరిగింది. ఆవుల సుబ్బారావును తాము అదుపులోకి తీసుకోలేదని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. సుబ్బారావును తాము కేవలం విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. మరికొన్ని ఆధారాలు వచ్చిన తర్వాతే డీజీపీ ఆదేశాల మేరకు సుబ్బారావు అరెస్ట్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. సుబ్బారావు వ్యవహారానికి సంబంధించి తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని తెలిపారు. అలాగే సుబ్బారావును యూపీ పోలీసులు విచారించారన్న వార్తల్లో వాస్తవంలేదన్నారు ఎస్పీ రవిశంకర్. మొత్తానికి ఎస్పీ ప్రకటనతో సుబ్బారావు వ్యవహారంలో ఏపీ పోలీసుల నుంచి స్పష్టత లభించింది.
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును కంభం సమీపంలోని తురిమెళ్ల నుంచి పోలీసులు తమ వెంట తీసుకెళ్తారు. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సికింద్రాబాద్ విధ్వంస ఘటనలో ఆయన ప్రమేయంపై ప్రశ్నిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం అబ్జర్వేషన్ లో ఉంచారు. సుబ్బారావు ఫోన్ నుంచి స్టూడెంట్స్‌కు పంపిన మేసేజ్ లపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కొందరు నిరుద్యోగులు విధ్వంసం సృష్టించడం తెలిసిందే. ఈ సందర్భంగా మూడు రైళ్లకు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో 14 మంది గాయపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..