Viral Video: పంట పండింది.. మత్య్సకారుల వలకు చిక్కిన అరుదైన చేపలు.. వీడియో వైరల్..

ఈ చేపలను వేలంలో లక్షల్లో ధర పెట్టి ఒక వ్యాపారి వీటిని కోనుగోలు చేసారు. ఇవి చిన్న చేపలు కావటంతో ఒక్కోక్క టి 50వేల ధర పలికి నాలుగు లక్షలకు కొనుగోలు చేశారు.

Viral Video: పంట పండింది.. మత్య్సకారుల వలకు చిక్కిన అరుదైన చేపలు.. వీడియో వైరల్..
Viral
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jun 20, 2022 | 11:01 AM

సాధారణంగా మత్స్యాకారులు చేపల వేటకు వెళ్లినప్పుడు వలలో వందలాది చేపలు చిక్కితే ఇక వారికి పండగే. కొన్నిసార్లు వలలో కొన్ని అరుదైన చేపలు.. విచిత్ర జంతువులు చిక్కుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో భారీ ధర పలికే చేపలు చిక్కుతుంటాయి. అలా అరుదైన జాతికి చెందిన చేపలు వలలో పడితే ఇక వారి సంతోషానికి అవధులుండవు..తాజాగ కాకినాడ సాగర తీరంలో మత్స్యకారుల వలకు అరుదైన కచ్చిడి చేపలు చిక్కాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 చేపలు వలకు చిక్కడంతో మత్సకారుల పంట పండింది. ఈ చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు . ఈ చేప ధర వింటే మాత్రం మతి పోవాల్సిందే. ఇంతకీ వాటికి ఉన్న ప్రత్యేకత ఎంటో ? తెలుసుకుందామా..

ఈ చేపలను వేలంలో లక్షల్లో ధర పెట్టి ఒక వ్యాపారి వీటిని కోనుగోలు చేసారు. ఇవి చిన్న చేపలు కావటంతో ఒక్కోక్క టి 50వేల ధర పలికి నాలుగు లక్షలకు కొనుగోలు చేశారు. ఈ చేపలు మంచి ఔషధ గుణాలు కలిగి ఉండటంతో లక్షల్లో పలుకుతున్న ఈ చేపల ధర.పొట్ట భాగాన్ని మందుల తయారీలోఉపయోగిస్తారట .ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ చేప శరీర భాగాలను ఉపయోగిస్తారట.ఆడ చేప కన్నా.. మగ చేప కు విపరీతమైన డిమాండ్ ఉందట .వేట విరామం తరువాత చేపల వేటకు వేళ్ళిన నాల్గో రోజే ఈ కచిడి చేప పడటంతో మత్సకారుల అనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి