Andhra Pradesh: ప్లాస్టిక్‌పై పోరును తీవ్రం చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. జూలై 1 నుంచి కఠిన నిబంధనలు

Plastic Ban: ప్లాస్టిక్‌పై పోరును మరింత తీవ్రం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా ప్లాస్టిక్‌ వినియోగంపై కీలక ఆదేశాలిచ్చింది. అందరూ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది..

Andhra Pradesh: ప్లాస్టిక్‌పై పోరును తీవ్రం చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. జూలై 1 నుంచి కఠిన నిబంధనలు
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jun 20, 2022 | 11:01 AM

Plastic Ban: ప్లాస్టిక్‌పై పోరును మరింత తీవ్రం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా ప్లాస్టిక్‌ వినియోగంపై కీలక ఆదేశాలిచ్చింది. అందరూ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌పై రోజురోజూ పోరు తీవ్రం అవుతోంది. ప్లాస్టిక్‌ తయారీ, అమ్మకం, వినియోగంపై కేంద్రం కఠిన ఆంక్షలు విధిస్తోంది. తక్కువ మందం గల కవర్లు పునర్‌ వినియోగానికి ఉపయోగపడకపోగా, పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయని భావించిన కేంద్రం, వాటి స్థానంలో ఈ ఏడాది డిసెంబర్‌ 31 నుంచి 120 మైక్రాన్లు, అంతకంటే ఎక్కువ మందం గల ప్లాస్టిక్‌ కవర్లను మాత్రమే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలకు జారీ చేసింది. దీంతో ఏపీలో ప్లాస్టిక్‌ కవర్లు తయారు చేస్తున్న, అమ్ముతున్న కేంద్రాలపై మున్సిపల్‌ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.

75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల సరుకును సీజ్‌ చేయడంతో పాటు, భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్‌, ముఖ్యంగా హోటళ్లు, శుభకార్యాల్లో వినియోగించే ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులు, టేబుల్‌పై పరిచే షీట్లు వంటి వాటి వినియోగాన్ని, జులై 1 నుంచి పూర్తిగా నిషేధిస్తూ, ఏపీ సర్కార్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. దీనిపై ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఏపీలో కాలుష్య నియంత్రణ మండలి వద్ద నమోదు చేసుకున్న 139 ప్లాస్టిక్‌ పరిశ్రమలు, తక్కువ మందంగల క్యారీబ్యాగులను తయారుచేస్తున్నాయి. వాటి లైసెన్సులను కూడా అధికారులు రద్దు చేశారు. జులై 1 నాటికి తమ వద్దనున్న సరుకును రీసైక్లింగ్‌కు పంపించాలని, లేకుంటే చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. వ్యాపారులు, ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి