AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani: ప్రేమ, పెళ్లి గురించి స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. అంత తీరక లేదంటూ..

ప్రస్తుతం తనకు ఇలాంటి వార్తల గురించి పట్టించుకునేంత తీరిక లేదని.. ఇలాంటి వార్తలను సృష్టించే వారు ఏం ఆశిస్తారో అర్థం కాదని తెలిపింది. నా వ్యక్తిగత విషయాల గురించి నా కుటుంబసభ్యుల దగ్గర మాత్రమే చర్చిస్తానని

Kiara Advani: ప్రేమ, పెళ్లి గురించి స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. అంత తీరక లేదంటూ..
Kiara
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2022 | 12:23 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది… ఆ తర్వాత వినయ విధేయ రామ మూవీలో మెప్పించింది. అయితే స్టార్ హీరోస్ నటించినప్పటికీ కియారాకు తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. తాజాగా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది చిన్నది.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి పలు వార్తలు బీటౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరో సిద్ధార్థ్, కియారా ప్రేమలో ఉన్నారని.. వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్స్ పై అటు సిద్ధార్థ్ కానీ.. కియారా స్పందించలేదు. తాజాగా తన గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించింది కియారా.

ప్రస్తుతం తనకు ఇలాంటి వార్తల గురించి పట్టించుకునేంత తీరిక లేదని.. ఇలాంటి వార్తలను సృష్టించే వారు ఏం ఆశిస్తారో అర్థం కాదని తెలిపింది. నా వ్యక్తిగత విషయాల గురించి నా కుటుంబసభ్యుల దగ్గర మాత్రమే చర్చిస్తానని.. ప్రస్తుతం తన కెరీర్ మీద మాత్రమే ఫోకస్ పెడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.. అలాగే.. నటిగా నేనేమిటో నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నానని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు తెలుగు, హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ చిన్నది.. ఇప్పుడు కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాకా వినిపిస్తోంది. టాలెంటెడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోుతన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ కోసం కియారా అద్వానీని సంప్రదించారట డైరెక్టర్. దీనిపై త్వరలోనే ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల