Smriti Irani: “ఢిల్లీ ఆటలు గుజరాత్ లో సాగవు.. తగిన జవాబు చెప్పడం తెలుసు”.. కేజ్రీవాల్ కు చురకలంటించిన కేంద్ర మంత్రి

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులతో అక్కడ పొలిటికల్ హీట్ నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి..

Smriti Irani: ఢిల్లీ ఆటలు గుజరాత్ లో సాగవు.. తగిన జవాబు చెప్పడం తెలుసు.. కేజ్రీవాల్ కు చురకలంటించిన కేంద్ర మంత్రి
Smriti Irani
Follow us

|

Updated on: Oct 02, 2022 | 1:00 PM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులతో అక్కడ పొలిటికల్ హీట్ నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో అక్కడ జరుగుతున్న ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే అధికార, విపక్షాల మధ్య వార్ నడుస్తోంది. ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆప్.. గుజరాత్ ఎన్నికలకు తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఢిల్లీలో అమలు చేస్తున్న విధానాలు, పద్ధతులను వివరిస్తున్నారు. గుజరాత్ లోనూ ఢిల్లీ మోడల్ పాలనను తీసుకువస్తానని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇస్తున్నారు. అందుకు దీటుగానే అధికార పక్షాలు బదులిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అరవింద్ కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ కలల వ్యాపారి ఆటలు గుజరాత్ లో సాగవని, ఇటుకలు విసిరితే ఎలా జవాబు చెబితే తెలుసునని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమేథీ ఎంపీ అయిన తాను గుజరాత్‌ కోడలిననే విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

నేను గుజరాత్ కోడల్ని. అయినా హిందీలోనే మాట్లాడతాను. ఎందుకంటే ఢిల్లీ నుంచి గుజరాత్ వచ్చే వాళ్లకు గుజరాతీ భాష తెలియదు. నర్మదా నీళ్లు ఇక్కడి ప్రజలకు అవసరమైనపుడు దానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఢిల్లీలో ఇప్పటికీ 690 మురికి వాడలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. నల్‌ సే జల్‌ ద్వారా ప్రజలకు నీటి వసతి కల్పించిన చరిత్ర ప్రధాని మోడీదే. ఈ సారి కూడా గుజరాతీ మహిళలు కమలం మీట నొక్కుతారు.

      – స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. ప్రధాని మోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికలు వీరిద్దరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారతాయి. ఇక్కడి గెలుపు, ఓటములు జాతీయ స్థాయిలోనూ ప్రభావం చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు కూడా ఈ ఏడాదే జరగనున్నాయి. అక్కడ కూడా ఆప్ పోటీ చేస్తున్నప్పటికీ గుజరాత్ నే అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ గా తీసుకున్నారు. కాంగ్రెస్ బలహీనపడిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసి.. గెలవకపోయినా ప్రతిపక్ష స్థానానికి ఎదగాలని కేజ్రీవాల్ ప్లాన్ గా తెలుస్తోంది.

తాజాగా అక్టోబర్ ఒకటో తేదీ శనివారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి గుజరాత్ లో పర్యటించారు ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్భంగా కచ్‌లోని గాంధీధామ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తామని, కచ్ జిల్లాలోని మారుమూల చోట్లకు కూడా నర్మదా జలాలను రప్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం