Smriti Irani: ఫన్నీ పోస్ట్‌‌‌‌తో నవ్వులు పూయిస్తోన్న సెంట్రల్ మినిస్టర్.. పెళ్లిపై సెటైర్లు వేసిన స్మృతి ఇరానీ..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం రకరకాల పోస్ట్ లతో ఆకట్టుకుంటూ ఉంటారు.

Smriti Irani: ఫన్నీ పోస్ట్‌‌‌‌తో నవ్వులు పూయిస్తోన్న సెంట్రల్ మినిస్టర్.. పెళ్లిపై సెటైర్లు వేసిన స్మృతి ఇరానీ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 23, 2021 | 7:55 PM

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం రకరకాల పోస్ట్ లతో ఆకట్టుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఫన్నీ వీడియోలను.. ఫోటోలను..సరదా పోస్ట్ లను షేర్ చేస్తూఉంటారు. తాజాగా ఆమె చేసిన ఓ ఫన్నీ పోస్ట్‌.. ఇప్పుడు తెగ వైరల్‌ అవుతుంది. పెళ్లి చేసుకునే వారికి ఓ సలహా అంటూ పోస్ట్ చేసి అందర్నీ నవ్వించారు స్మృతి ఇరానీ. మీరు ఒక వ్యక్తిని పెళ్లాడే ముందు.. ఆ వ్యక్తితో   ఇంటర్నెట్‌ స్లోగా ఉన్న కంప్యూటర్ ఇచ్చి దాని మీద పనిచేయమనండి.. తద్వారా ఆ వ్యక్తిలో సహనంతో పాటు ఆ సమయంలో ప్రవర్తించే తీరును పరీక్షించొచ్చు. ఆపై ఒక అంచనాకు వచ్చి పెళ్లి చేసుకోడంటూ సరదాగా ఇన్‌స్టగ్రామ్‌లో స్టోరీలో పోస్ట్‌ చేశారు స్మృతి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి.

ఇక చివరగా.. ఆంటీ సలహా అంటూ… ఏ పదార్థమూ పర్‌ఫెక్ట్ గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మలుచుకోవాలంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌పై నెటిజన్స్‌ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తూ.. వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకొని షేర్ చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Smriti Irani

Smriti Irani

మరిన్ని ఇక్కడ చదవండి : 

Telangana Politics 2023: తెలంగాణలో రాజకీయ రణం మొదలైందా.. ఈ పోరు ఆ దిశగానేనా..

Telangana: ఎంసెట్, నీట్, ఐఐటీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్…

Vizag Steel : విశాఖ ఉక్కు సంఘాల నేతలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రితో విజయసాయి రెడ్డి భేటీ.. హైలైట్స్