రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి ఇళ్లలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సోదాలు, దాడులు.. అరెస్టుపై కోర్టుకెక్కిన కుంద్రా
రాజ్ కుంద్రా, ఆయన భార్య శిల్పా శెట్టి ఇళ్లపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడులు చేశారు. ముంబై జుహూ లోని వీరి ఇళ్లపై రైడ్స్ జరిపామని, ఈ కేసులో శిల్పా శెట్టిని కూడా విచారించే అవకాశం ఉందని వారు చెప్పారు.
రాజ్ కుంద్రా, ఆయన భార్య శిల్పా శెట్టి ఇళ్లపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడులు చేశారు. ముంబై జుహూ లోని వీరి ఇళ్లపై రైడ్స్ జరిపామని, ఈ కేసులో శిల్పా శెట్టిని కూడా విచారించే అవకాశం ఉందని వారు చెప్పారు. అంధేరీ వెస్ట్ లో వియాన్ అనే కంపెనీ డైరెక్టర్లలో శిల్పా శెట్టి కూడా ఒకరు. ఈ సంస్థ కార్యాలయంపై ఖాకీలు దాడి చేసి.. పోర్న్ మూవీల డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎలెక్ట్రానిక్ డేటా అంతా టెరాబైట్స్ లో ఉందని వారు తెలిపారు. డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు తాము ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. ఇందుకు చాలా సమయం పట్టవచ్చు అన్నారు. 2019 ఆగస్టు నుంచి రాజ్ కుంద్రా పోర్న్ మూవీలు తీయడం ప్రారంభించాడని, అప్పటి నుంచి సుమారు 100 చిత్రాలు తీశాడని పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా తన అరెస్టు చట్ట విరుద్ధమని అంటూ రాజ్ కుంద్రా బాంబేహైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఒరిజినల్ ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేదని, తన అరెస్టు తరువాత తన చేత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 41 ఏ నోటీసుపై సంతకం చేయమన్నారని, ఇది చట్ట ఉల్లంఘన అని ఆయన ఇందులో పేర్కొన్నాడు. అంతకు ముందు స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో తన క్లయింటు కుంద్రా తరఫున మరో పిటిషన్ వేసిన లాయర్.. సంబంధిత వీడియోలను అశ్లీల వీడియోలుగా పరిగణించరాదని కోరాడు. ఏ ప్రాతిపదికపై వీటిని అసభ్యంగా పరిగణిస్తారో చెప్పాలని అన్నాడు. ఏమైనా రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి ల వ్యవహారం ముంబైనగరంలో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Traffic Advisory: ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి.. శంషాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్డు మూసివేత.. వివరాలివే
Fire Dosa: నిప్పులు చిమ్మే ఫైర్ దోస.. ఇది చూసి షాక్ తింటున్న జనం..