వరదల్లో చిక్కుకున్న మహిళ.. కాపాడటానికి ప్రయత్నించిన రెస్క్యూ టీమ్.. ఇంతలో..

ఎక్కడ చూసిన వర్షాలు బీభత్సము సృష్టిస్తున్నాయి. వర్షాలధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. వరదలు ఊర్లను ముంచెత్తుతున్నాయి.

వరదల్లో చిక్కుకున్న మహిళ.. కాపాడటానికి ప్రయత్నించిన రెస్క్యూ టీమ్.. ఇంతలో..


MaharashtraRains: ఎక్కడ చూసిన వర్షాలు బీభత్సము సృష్టిస్తున్నాయి. వర్షాలధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. వరదలు ఊర్లను ముంచెత్తుతున్నాయి. ప్రజలు చాలామంది వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి ప్రజలను రక్షిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని తీరప్రాంతాల్లో కూడా వరదలు బీభత్సం సృష్టించాయి. 70వేల మందికిపైగా జనాభా ఉన్న చిప్లున్‌ నగరం సగానికిపైగా వరద నీటిలో మునిగిపోయింది. ఐదు వేల మందికిపైగా ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. వారందరిని కాపాడటానికి అధికారులు , పోలీసులు, రెస్క్యూ టీమ్ నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న ఓ మహిళను రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది విఫలయత్నం చేశారు. వరద నీటిలో చిక్కుకున్న ఆమెను ఒక భవనం పైకి తెచ్చే ప్రయత్నంలో.. పట్టుతప్పి మళ్లీ వరదలోని పడిపోయింది.

వరదలో చిక్కుకున్న మహిళను ఓ తాడు సాయంతో కట్టిన టైర్‌ను కిందకు పంపించారు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది. ఆ మహిళ టైర్‌ను పట్టుకోగా తాడును పైకి లాగారు. అయితే ఆమె భవనం టెర్రస్‌ వరకు చేరగా రెస్క్యూ సిబ్బందిలో ఒకరు ఆమె చేయి అందుకుని పైకి లాగేందుకు ప్రయత్నించారు. కానీ అంతలోనే ఆ మహిళ పట్టుకోల్పోయి టెర్రస్‌ నుంచి మళ్లీ వరదలోనే పడిపోయింది. ఈ ఘటనలో ఆ మహిళకు చిన్నపాటి గాయాలు అయిన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Telangana: ఎంసెట్, నీట్, ఐఐటీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్…

Vizag Steel : విశాఖ ఉక్కు సంఘాల నేతలతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రితో విజయసాయి రెడ్డి భేటీ.. హైలైట్స్

Mysterious Village: అక్కడికి వెళ్లినవారు తిరిగిరారట.. ఎందుకు ఇలా జరుగుతోంది.. ఎక్కడుంది..

Click on your DTH Provider to Add TV9 Telugu