దివంగత ఫాదర్ స్టాన్ స్వామిని ప్రశంసిస్తూ బాంబే హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు.. జాతీయ దర్యాప్తు సంస్థ అభ్యంతరంతో ఉపసంహరణ
బాంబే హైకోర్టులో శుక్రవారం అనూహ్య ఘటన జరిగింది. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన దివంగత ఫాదర్ స్టాన్ స్వామిని ప్రశంసిస్తూ జస్టిస్ ఎస్.ఎస్. షిండే చేసిన వ్యాఖ్యలు కోర్టులో కొంత సంచలనం రేపాయి..

బాంబే హైకోర్టులో శుక్రవారం అనూహ్య ఘటన జరిగింది. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన దివంగత ఫాదర్ స్టాన్ స్వామిని ప్రశంసిస్తూ జస్టిస్ ఎస్.ఎస్. షిండే చేసిన వ్యాఖ్యలు కోర్టులో కొంత సంచలనం రేపాయి. స్వామిపై ఎన్ని కేసులున్నా..సమాజానికి ఆయన చేసిన కృషిని అభినందించాల్సిందేనని, ఆయన మృతిని ఎవరూ ఊహించలేదని షిండే వ్యాఖ్యానించారు. మౌఖికంగా ఆయన చేసిన ఈ కామెంట్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ..ఎన్ఐఏ) తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధమైన వ్యాఖ్యలు ప్రజల్లో తమ సంస్థ పట్ల నెగెటివ్ అభిప్రాయాలను కలుగజేస్తాయన్నారు. (ఎన్ఐఏ కస్టడీలో 84 ఏళ్ళ స్టాన్ స్వామి మృతి చెందిన విషయం గమనార్హం). ఇందుకు వెంటనే స్పందించిన జస్టిస్ షిండే..న్యాయమూర్తులు కూడా మానవమాత్రులేనని, ఈ నెల 5 న స్టాన్ స్వామి మరణ సమాచారం చాలా బాధ కలిగించిందని అన్నారు. అయితే తన వ్యాఖ్యలు ఎవరినయినా నొప్పించి ఉంటే వాటిని ఉపసంహరించుకుంటున్నానన్నారు. మనం తులనాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని, తామెప్పుడూ కామెంట్లు చేయలేదని, కానీ మనం మానవమాత్రులమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
ఇలా ఏదైనా హఠాతుగా జరగవచ్చు అని అన్నారు. ఈ కేసులో ఏ లాయర్ పట్ల గానీ, ఏ ఏజన్సీ పట్ల గానీ వ్యక్తిగతంగా వ్యతిరేక వ్యాఖ్యలు తగవని ఆయన చెప్పారు. మాకు అన్ని కేసులూ సమానమే అని స్పష్టం చేశారు. కాగా ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్ కూడా స్టాన్ స్వామి మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా వరవరరావు వంటి మేధావులు ఈ సమాజం పట్ల తమ అభిప్రాయాలను తెలియజేస్తే తప్పేమిటని ఆయన అన్నారు. 84 ఏళ్ళ స్టాన్ స్వామి ఈ దేశ వ్యతిరేకి ఎలా అవుతారని కూడా ఆయన పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Speaker Tammineni: అత్యాచారాలు చేసేవారిని అంతం చేయాలి.. ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన కామెంట్స్
Speaker Tammineni: అత్యాచారాలు చేసేవారిని అంతం చేయాలి.. ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన కామెంట్స్



