AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna kamal: మొత్తం మాభారతాన్ని ఆవిష్కరించే కౌరవపాండవ పుష్పం.. ఈ పువ్వు గురించి అనేక జానపద కథలు

Kaurav Pandav Flower: మనిషికి ప్రకృతికి విడదీయలేని బంధం ఉంది. ఈ ప్రకృతిలో మనకు తెలిసిన అద్భుతాలు కొన్ని ఉంటె.. తెలియనివి ఎన్నో ఉన్నాయి. కొన్ని అద్భుతాలు మతపరమైన..

Krishna kamal: మొత్తం మాభారతాన్ని ఆవిష్కరించే కౌరవపాండవ పుష్పం.. ఈ పువ్వు గురించి అనేక జానపద కథలు
Kaurav Pandav Flower
Surya Kala
|

Updated on: Jul 23, 2021 | 5:42 PM

Share

Kaurav Pandav Flower: మనిషికి ప్రకృతికి విడదీయలేని బంధం ఉంది. ఈ ప్రకృతిలో మనకు తెలిసిన అద్భుతాలు కొన్ని ఉంటె.. తెలియనివి ఎన్నో ఉన్నాయి. కొన్ని అద్భుతాలు మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగివున్నాయి. హిందూ ధర్మంలో పంచమవేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం మొత్తం ఒక పుష్పంలో ఉందట.. ఎంతో అందంగా కనిపించి కనువిందు చేసే ఈ పువ్వులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయట.. వాడుకభాషలో ఎక్కువా ఈ పుష్పాన్ని కౌరవ-పాండవ పువ్వు అని పిలుస్తారు. కృష్ణ కమలం అని కూడా మరో పేరు ఉంది.

మూడేళ్లకు ఒకసారి వికసించే ఈ కృష్ణ కమలం మొత్తం మహాభారత కథని వివరిస్తుందట. మహాభారత కాలంలోని అన్ని ముఖ్యమైన పాత్రలు ఇందులో ఉన్నాయని నమ్ముతారు. కౌరవులు, పాండవులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శ్రీకృష్ణుడు అందరూ ఈ పుష్పంలో ఉన్నారట. ఎలాగంటే..? ఈ పుష్పం చుట్టూ పుసన్నని తీగవంటి పెటల్స్ లేదా రేకుల సంఖ్య 100, ఇవి కౌరవులకు చెందినవి. ఆపైన ఐదు రెక్కలుంటాయి. వీటిని పాండవులకు చిహ్నంగా భావిస్తారు. ఆ ఐదు రెక్కలపై మూడు రెక్కలు కొలువై ఉన్నాయి. వాటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లుగా అభివర్ణిస్తారు. మధ్యలో సుదర్శన చక్రం ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడికి ప్రతీకగా భావిస్తారు.

ఇన్ని ప్రత్యేకతలున్న పువ్వు మూడేళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తుంది.. ఇలా వికసించిన కృష్ణ కమలాన్ని యూఎన్ మాజీ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ఎం పూరి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కౌసౌలి పట్టణంలో వికసించిన ఈ కృష్ణ కమలాన్ని ఆమె షేర్ చేశారు. ఒక పువ్వు అద్భుతాన్ని స్పష్టంగా చూడగలిగితే మన జీవితమే మారిపోతుందన్న బుద్ధుడి స్తూకిని లక్ష్మీ ఈ సందర్భంగా ఫోటోకి జోడించారు. ఈ కృష్ణ కమలాలు బుందేల్‌ఖండ్‌తో సహా చుట్టుపక్కల వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కౌరవపాండవ పుష్పం గురించి అనేక జానపద కథలు అక్కడ ప్రచారంలో ఉన్నాయి.

Also Read: Nitin Check Movie: వెండి తెరపై నితిన్ ప్లాప్ సినిమాకు బుల్లి తెరపై షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్..