Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌పై బాదుడు.. గత ఆరేళ్లల్లో ఎంతశాతం పన్నులు పెరిగాయో తెలుసా..?

Central government tax collection: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్న సంగతి తెలిసిందే. నిత్యం పెరుతున్న ధరలతో వాహనదారులు తల పట్టుకుంటున్నారు. అయితే చమురు ధరలపై గత ఆరేళ్లల్లో పెరిగిన

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌పై బాదుడు.. గత ఆరేళ్లల్లో ఎంతశాతం పన్నులు పెరిగాయో తెలుసా..?
Central government - Fuel Rates
Follow us

|

Updated on: Mar 22, 2021 | 7:54 PM

Central government tax collection: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్న సంగతి తెలిసిందే. నిత్యం పెరుతున్న ధరలతో వాహనదారులు తల పట్టుకుంటున్నారు. అయితే చమురు ధరలపై గత ఆరేళ్లల్లో పెరిగిన ధరలను చూస్తే మీరే షాకవుతారు. ఎందుకంటే.. దాదాపు ఆరేళ్ల క్రితం ఉన్న ధరలపై 300ల శాతం పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్సైజ్ సుంకం పెరగడంతో గత ఆరేళ్లలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 300 శాతానికి పైగా పెరిగాయని లోక్‌సభలో కేంద్రం సోమవారం తెలిపింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. 2014-15లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం ద్వారా పెట్రోల్‌పై రూ .29,279 కోట్లు వసూలు చేయగా.. డీజిల్‌పై రూ .42,881 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి 10 నెలల్లో పెట్రోల్, డీజిల్ వసూళ్లు రూ .2.94 లక్షల కోట్లకు పెరిగాయని విదేశాంగ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభలో అడిగిన అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

సహజ వాయువుపై ఎక్సైజ్ సుంకంతో కలిపి 2014-15లో కేంద్ర ప్రభుత్వం రూ .74,158 కోట్లు వసూలు చేసింది, ఇది 2020 ఏప్రిల్ నుండి 2021 జనవరి వరకు రూ .2.95 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన తెలిపారు. 2014-15లో మొత్తం ఆదాయంలో ఒక శాతంగా పెట్రోల్, డీజిల్, సహజ వాయువుపై వసూలు చేసిన పన్నులు 5.4 శాతం ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 12.2 శాతానికి పెరిగాయని అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 2014లో లీటరుకు 9.48 రూపాయల ఉండగా.. ఇప్పుడు రూ .32.90 కు పెరిగింది. డీజిల్‌పై లీటరుకు 3.56 రూపాయల నుంచి 31.80 రూపాయలకు పెరిగింది.

అయితే ఢిల్లీలో రూ .91.17 ఉన్న లీటరు పెట్రోల్ రిటైల్ ధరలో.. 60 శాతం పన్నులు ఉన్నాయి. ఈ ధరలో 36 శాతం ఎక్సైజ్ సుంకం ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా డీజిల్ ధర 81.47 ఉండగా.. దీనిలో 53 శాతానికి పైగా పన్నులు ఉన్నాయి. 39 శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్నులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అయితే అంతర్జాతీయ చమురు ధరల ప్రకారం.. రేట్లు పెరుగుతున్నట్లు ఆయన తెలిపారు.

Also Read:

BIS Hallmarking Scheme: జూన్ 1 తర్వాత ఆ బంగారాన్ని అమ్మలేరు.. కొత్తగా కొనాలన్నా ఈ నిబంధనలు పాటించాల్సిందే..!

‘ఇది కంఫర్ట్ జోన్ కాదు.. కానీ జీవితమంటేనే ఓ ప్రయోగం’.. కష్టాలను చెప్పుకుంటున్న రేణు దేశాయ్..

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!