BREAKING NEWS: సూర్యాపేటలో జాతీయ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి.. కూలీన గ్యాలరీ..
Suryapet Mishap: సూర్యాపేటలో జాతీయ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. మూడు గ్యాలరీలు కూలి పలువురికి గాయాలయ్యాయి.
Suryapet Mishap: సూర్యాపేటలో జాతీయ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. గ్యాలరీ కూలి పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. జాతీయ కబడ్డీ క్రీడలను వీక్షించేందుకు మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గ్యాలరీల్లో 1500 మంది ప్రేక్షకులు ఉన్నారు. ప్రమాద జరిగిన ప్రాంతంలో గందరగోళం నెలకుంది. స్థానిక అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ఈ పోటీలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభిస్తారనగా .. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొంతమంది ఒత్తడి కారణంగా శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడ్డారు. ఈ కబడ్డీ క్రీడల కోసం పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు.
అయితే ఈ ప్రమాదంలో 60 మందికిపైగా వ్యక్తులకు గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సామర్థ్యానికి మించి ప్రేక్షకులను అనుమతించడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు కూడా చెబుతున్నారు. వేల కెపాసిటీ ఉన్న ఇనుప స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలిందని.. ఇలా ఊహించలేదంటూ స్థానికులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సూర్యపేటలో గుంతకండ్ల సావిత్రమ్మ పేరు మీద ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
#BigBreaking సూర్యపేట లో గుంతకండ్ల సావిత్రమ్మ పేరు మీద నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్ లో అపశృతి. ఒకవైపు గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి తీవ్రగాయాలు pic.twitter.com/iWgQF3r04U
— Murali Krishna TV9 (@encounterwithmk) March 22, 2021
Also Read: Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌పై బాదుడు.. గత ఆరేళ్లల్లో ఎంతశాతం పన్నులు పెరిగాయో తెలుసా..?
పీఆర్‌సీలో మీకు పెరిగిన జీతం ఎంతో తెలుసా.. అయితే ఈ క్యాలిక్యులేటర్‌తో చూసుకోండి..!
ఆర్టీవో కొత్త నిబంధనలు.. డ్రైవింగ్ లైసెన్స్‌తో సహ 18 పనులు ఇంటి నుంచే.. అవేంటో తెలుసుకోండి..