BSP MLA Ram Bhai: లంచం తీసుకుంటే తప్పేముంది.. బీఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. వీడియో వైరల్
ఉన్నత భావాలతో ఉండాల్సిన రాజకీయ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ అబాసుపాలవుతున్నారు. తమ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి తర్వాత క్షమాపణ చెబుతున్నారు...
ఉన్నత భావాలతో ఉండాల్సిన రాజకీయ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ అబాసుపాలవుతున్నారు. తమ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి తర్వాత క్షమాపణ చెబుతున్నారు. లేకుంటే తమ మాటలను మీడియా వక్రీకరించిందని చెబుతున్నారు. ఇలా ఓ ఎమ్మెల్యే అధికారులు లంచం తీసుకోవడాన్ని సమర్థిస్తూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాంబాయ్ స్వచ్ఛందంగా అందించే” లంచాలను స్వీకరించవచ్చని చెప్పడం వివాదాస్పదమైంది. కానీ లంచం డిమాండ్ చెయ్యొద్దని చెప్పారు. రాష్ట్ర పంచాయితీ అధికారుల సమక్షంలో దామోహ్ జిల్లాలోని తన నియోజకవర్గం పఠారియాకు చెందిన కొంతమంది గ్రామస్థుల మధ్య జరిగిన సంభాషణలో ఎమ్మెల్యే ఇలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద నిధులు విడుదల చేయడానికి లంచలు ఇవ్వాల్సి వచ్చిందని గ్రామస్థులు ఆరోపించారు. ఎంత చెల్లించారని ఎమ్మెల్యే వారిని అడిగారు. అప్పుడు వారు సమాధానమిస్తూ రూ.5,000 నుంచి రూ .9,000 వరకు చెల్లించామని చెప్పారు. అక్కడే రూమ్‌లో కుర్చీలపై కూర్చున్న ఇద్దరు వ్యక్తుల (పంచాయితీ సెక్రటరీ మరియు రోజ్‌గార్ సహాయక్) వైపు వేళ్లు చూపిస్తూ డబ్బును ఎవరికి చెల్లించారని ఎమ్మెల్యే అడిగారు.
మీరు రూ.500 లేదా రూ .1,000 తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండేది అధికారులతో అన్నారు. కానీ ఎక్కువ మొత్తం డిమాండే చెస్తే బాగుండదని చెప్పారు. నెలకు రూ .6,000 సంపాదించడానికి ఈ గ్రామస్థులు కష్టపడుతున్నారని, జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని ఎమ్మెల్యే అధికారులకు చెప్పారు. ఈ సంభాషణ సోషల్ మీడియాలోవైరల్గా మారింది. దీనిపై దామోహ్ జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ చైతన్య సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత గ్రామస్థులు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని పఠారియా జనపడ్ సీఈఓను ఆదేశించినట్లు కృష్ణ చైతన్య తెలిపారు.దీనిపై ఎమ్మెల్యేను సంప్రదించగా భారతదేశం అంతటా ప్రభుత్వ వ్యవస్థలో “ఇదే పరిస్థితి” ఉందని చెప్పారు.
शिवराज जी चुनावी क्षेत्र में रोज कह रहे है कि ना खाऊँगा और ना खाने दूँगा और वही गृह मंत्री नरोत्तम मिश्रा को राखी बांधने वाली बसपा विधायक राम बाई रिश्वत खोरी को लेकर खुलेआम कह रही है कि “ हम भी जानत है कि अंधेर नगरी चौपट राजा चल रहा है “ …..? pic.twitter.com/PVjgvvq9u6
— Narendra Saluja (@NarendraSaluja) September 27, 2021
Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?