Bus in Water video: మహారాష్ట్రలో వరదల బీభత్సం.. వరదలో కొట్టుకుపోయిన బస్సు.. ఇద్దరు మృతి, నలుగురిని రక్షించిన అధికారులు

Naded Bus Accident: గులాబ్‌ తుఫాను ప్రభావంతో కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను సైతం వదలడంలేదు. ఇటు తెలంగాణలపై తీవ్రంగా చూపుతోంది.

Bus in Water video: మహారాష్ట్రలో వరదల బీభత్సం.. వరదలో కొట్టుకుపోయిన బస్సు.. ఇద్దరు మృతి, నలుగురిని రక్షించిన అధికారులు
Bus In Water
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 28, 2021 | 4:43 PM

Bus Swept Away in Water: గులాబ్‌ తుఫాను ప్రభావంతో కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను సైతం వదలడంలేదు. ఇటు తెలంగాణలపై తీవ్రంగా చూపుతోంది.

అటు మహారాష్ట్రలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాందేడ్‌ -నాగ్‌పూర్‌ హైవేపే రోడ్డు రవాణా సంస్థ బస్సు అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయింది. యావత్‌మాల్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వరదలో కొట్టుకుపోయిన బస్సులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా .. నలుగురు మాత్రం ఈదుకుంటూ బయటపడ్డారు. భారీ వరదల కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఆకస్మాత్తుగా కాలువ దగ్గర వరద ప్రవాహం పెరగడంతో బస్సు కొట్టుకుపోయింది. స్థానికులకు కాసేపు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇద్దరు ప్రయాణికులకు కాపాడడానికి సహాయక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. డ్రైవర్‌ వరద ప్రవహాన్ని ఊహించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Read Also…. Mumbai Indians Vs Punjab Kings: నిలవాలంటే గెలవాల్సిందే.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే..? వీడియో

AP Weather Report: రాగల 3 రోజుల్లో ఏపీలో మోస్తారు వర్షాలు.. ఆ 2 జిల్లాలో మాత్రం భారీ వర్షాలు