PM Narendra Modi: బీజేపీ మరో ఘనత.. ప్రతి కార్యకర్తకూ గర్వకారణమంటూ ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మరో ఘనత సాధించింది.  కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి తొలిసారిగా బీజేపీ నేత రాజ్యసభకు ఎంపికయ్యారు. బీజేపీ నేత ఎస్.సెల్వగణపతి పుదుచ్చేరి నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

PM Narendra Modi: బీజేపీ మరో ఘనత.. ప్రతి కార్యకర్తకూ గర్వకారణమంటూ ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
PM Narendra Modi
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 28, 2021 | 4:49 PM

BJP:  భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మరో ఘనత సాధించింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి తొలిసారిగా బీజేపీ నేత రాజ్యసభకు ఎంపికయ్యారు. బీజేపీ నేత ఎస్.సెల్వగణపతి పుదుచ్చేరి నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీనిపై హర్షం వ్యక్తంచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరి నుంచి బీజేపీ అభ్యర్థి సెల్వగణపతి రాజ్యసభకు ఎన్నికవడం ప్రతి పార్టీ కార్యకర్తకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. పుదుచ్చేరి ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకం తమలో వినమ్రతను మరింత పెంచుతున్నట్లు చెప్పారు. పుదుచ్చేరి అభివృద్ధి కోసం తమ పార్టీ తన కృషిని కొనసాగిస్తుందన్నారు.

పుదుచ్చేరిలో బీజేపీ-ఏఐఎన్‌ఆర్‌సీ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఏఐఎన్‌ఆర్‌సీ మద్ధతుతో బీజేపీ అక్కడ రాజ్యసభ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..

అలాగే అస్సాం, మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర మంత్రులు శర్వానంద్ సోనోవాల్, ఎల్.మురుగన్‌లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వీరంతా ప్రజాశ్రేయస్సు కోసం పార్లమెంటు కార్యక్రమాలను మరింత ఇనుమడింప చేస్తారని తనకు నమ్మకం ఉన్నట్లు చెప్పారు.

Also Read..

Huzurabad By Elections: ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలతో హుజురాబాద్‎లో వేడెక్కిన రాజకీయం..

Bigg Boss Telugu 5 : రవికి అసలు విషయం చెప్పిన నటరాజ్ మాస్టర్.. ఈ సారి విశ్వతో వార్‌కు దిగనున్న రవి..