PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం తీపి కబురు..పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం రెట్టింపు చేసే యోచనలో కేంద్రం..!

రైతులకు మోడీ ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. దీపావళి పండుగ లోపు దేశంలోని 12 కోట్ల మందికి పైగా రైతులకు పెద్ద బహుమతి ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం తీపి కబురు..పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం రెట్టింపు చేసే యోచనలో కేంద్రం..!
Pm Kisan
Follow us
KVD Varma

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 28, 2021 | 6:07 PM

PM Kisan: రైతులకు మోడీ ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. దీపావళి పండుగ లోపు దేశంలోని 12 కోట్ల మందికి పైగా రైతులకు పెద్ద బహుమతి ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన మొత్తాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది జరిగితే, రైతులు సంవత్సరానికి ప్రస్తుతం పొందుతున్న రూ.6000 కి బదులుగా మూడు సమాన వాయిదాలలో రూ.12000 పొందుతారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద దేశంలోని 12.14 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారు. వారంతా ప్రస్తుతం 2000 రూపాయల చొప్పున మూడు వాయిదాలలో సంవత్సరానికి 6000 రూపాయలు తమ ఎకౌంట్లలో నేరుగా పొందుతున్నారు.

బీహార్ వ్యవసాయ మంత్రి అమరేంద్ర ప్రతాప్ సింగ్, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఆ తరువాత పీఎం కిసాన్ సమ్మన్ నిధి మొత్తం రెట్టింపు అవుతుందని మీడియాతో చెప్పారు. అప్పటినుంచి ఈ వార్త చర్చల్లో నిలిచింది. అయితే, ఇప్పుడు ఇందుకోసం ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేసినట్లు తెలిసింది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో ప్రభుత్వం త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. రైతులు కూడా అదే ఆశాభావంతో ఉన్నారు. రైతులు ఇలా అనుకోవడానికి కూడా ఓ కారణం ఉంది. యూపీలో యోగీ ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి రైతులు కోరుతున్నా..చెరకు మద్దతు ధరను పెంచలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఈ ధరలను పెంచారు. అందుకే, పీఎం కిసాన్ నిధిని కూడా పెంచుతారని రైతులు ఆశాభావంతో ఉన్నారు. “పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుతున్నప్పుడు, సమ్మాన్ నిధి కూడా పెరగాలి. ఖరీదైన డీజిల్ కారణంగా వ్యవసాయ వ్యయం పెరుగుతోంది. వ్యవసాయ కార్మికుల వేతనాలు కూడా చాలా ఎక్కువ అయ్యాయి. రైతులను ప్రభుత్వం మరింతగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం కిసాన్ సమ్మన్ నిధి మొత్తాన్ని పెంచడం ఒక మార్గం.” అని చాలామంది రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపధ్యంలో మీడియాలో జరుగుతున్న చర్చల మధ్య, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, అదే సమయంలో, సాధారణ రైతులు కూడా 2024 కి ముందు, ప్రభుత్వం PM కిసాన్ మొత్తాన్ని పెంచవచ్చని ఆశిస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 2000-2000 రూపాయల 9 వాయిదాలను విడుదల చేసింది. ఇప్పుడు నవంబర్ 30 వరకు, 9 వ విడత డబ్బు మిగిలిన రైతుల ఖాతాకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. దీని తరువాత తదుపరి వాయిదా డిసెంబర్ 15 వరకు రావచ్చు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన 2018 లో ప్రారంభమైంది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 1.38 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖాతాలకు పంపించామని మంత్రి అమరేంద్ర ప్రతాప్ చెప్పారు.

ఇప్పుడే నమోదు చేసుకోండి.. 

ఎవరైనా రైతులు ఇప్పటివరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే, సెప్టెంబర్ 30 వరకు రూ.4000 పొందే గొప్ప అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద, ఈ ఆర్థిక సంవత్సరం రెండవ విడత అంటే ఆగస్టు-నవంబర్‌లో రూ. 2000 మొత్తం 10.27 కోట్ల రైతుల ఖాతాలకు చేరింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 12.14 కోట్ల రైతు కుటుంబాలు కనెక్ట్ అయ్యాయి. అదే సమయంలో, నవంబర్ 30 వరకు, మిగిలిన రైతుల ఖాతాలకు డబ్బు చేరుతుంది.

పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజనలో నమోదు కోసం, మీరు వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలి. ఇది కాకుండా, ఆధార్ కార్డు , అప్‌డేట్ చేసిన బ్యాంక్ ఖాతా, చిరునామా రుజువు, ఫీల్డ్ సంబంధిత సమాచారం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం. PM కిసాన్ సమ్మన్ నిధి యోజనలో నమోదు కోసం ఇలా చేయండి..

1: ఇప్పుడు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కొత్త రిజిస్ట్రేషన్ ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

2: కొత్త పేజీలో, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫారం తెరుచుకుంటుంది.

3: రిజిస్ట్రేషన్ ఫారంలో, మీరు రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా, రైతులు తమ పేరు, లింగం, వర్గం, ఆధార్ కార్డు సమాచారం, డబ్బు బదిలీ చేయబడే బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్, చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ మొదలైన వివరాలు అందించాలి. మీరు మీ వ్యవసాయ సమాచారాన్ని అందించాలి. ఇందులో, సర్వే లేదా ఖాతా సంఖ్య, తట్టు సంఖ్య, ఎంత భూమి ఉంది, ఈ మొత్తం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత, మీరు దానిని సేవ్ చేయాలి. మొత్తం సమాచారం ఇచ్చిన తర్వాత, రిజిస్ట్రేషన్ కోసం ఫారం సమర్పించాలి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, మీరు పీఎం కిసాన్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ – 011-24300606.

Also Read: Viral News: ‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..