AP Weather Report: రాగల 3 రోజుల్లో ఏపీలో మోస్తారు వర్షాలు.. ఆ 2 జిల్లాలో మాత్రం భారీ వర్షాలు

AP Weather Report: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో

AP Weather Report: రాగల 3 రోజుల్లో ఏపీలో మోస్తారు వర్షాలు.. ఆ 2 జిల్లాలో మాత్రం భారీ వర్షాలు
Ap Weather
Follow us
uppula Raju

|

Updated on: Sep 28, 2021 | 3:16 PM

AP Weather Report: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయి వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో బలపడే అవకాశం ఉంది.

‘తూర్పు-పశ్చిమ ఉపరితల ద్రోణి’ ప్రస్తుతం ఉత్తరకొంకన్ ప్రాంతము నుంచి నైరుతి విదర్భ & ఉత్తరకోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాగల మూడు రోజులకు ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి.

ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

Indian Army: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్న భగ్నం.. పాక్ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్న భారత ఆర్మీ

Pushpaka Vimanam: ముచ్చటగా మూడో సినిమాతో రాబోతున్న దేవరకొండ బ్రదర్.. ‘పుష్పక విమానం’ రిలీజ్ ఎప్పుడంటే..

Covid-19 Effect: కోవిడ్‌తో మరణించిన తండ్రి.. జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆ తనయుడు ఏం చేశాడంటే..