AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpaka Vimanam: ముచ్చటగా మూడో సినిమాతో రాబోతున్న దేవరకొండ బ్రదర్.. ‘పుష్పక విమానం’ రిలీజ్ ఎప్పుడంటే..

ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ..

Pushpaka Vimanam: ముచ్చటగా మూడో సినిమాతో రాబోతున్న దేవరకొండ బ్రదర్.. 'పుష్పక విమానం' రిలీజ్ ఎప్పుడంటే..
Pushpaka Vimanam
Rajeev Rayala
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 28, 2021 | 7:01 PM

Share

Anand Deverakonda: ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ.. దొరసాని అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆనంద్. దొరసాని సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా… ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఆ సినిమా తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చేశాడు ఆనంద్. ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పుష్పక విమానం అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తుంది. నూతన దర్శకుడు దామోదర ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్.. నవంబర్ 12 ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దర్శకుడు మాట్లాడుతూ..”పుష్పక విమానం సినిమాలో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్‌గా కనిపిస్తారని… మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామాని గుర్తుచేస్తూ.. పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని సినిమాలో చూపించాం… ఇది ఫ్యామిలీ అంతా చూడదగ్గ కామెడీ చిత్రం. నవంబర్ 12న థియేటర్లలో కలుసుకుందాం” అని అన్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఓ పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గీత్ సైని – శాన్వి మేఘన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను  విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోవర్ధన్ రావు దేవరకొండ – విజయ్ దషి – ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.Anand

Anand

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections: ఇది ఆత్మ గౌరవ పోరాటం, మా ఎన్నికల్లో మీరు తలదూర్చకండి.. విష్ణు షాకింగ్ కామెంట్స్‌..

Bigg Boss 5 Telugu: డేంజర్‏ జోన్‏లో ఆ ముగ్గురు.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా ?

Sushmita Konidela Photos: సోషల్ మీడియాలో సుస్మిత కొణిదల ఫొటోస్… వావ్ అంటున్న ఫ్యాన్స్..