MAA Elections: ఇది ఆత్మ గౌరవ పోరాటం, మా ఎన్నికల్లో మీరు తలదూర్చకండి.. విష్ణు షాకింగ్ కామెంట్స్..
MAA Elections 2021: ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారుతోన్న విషయం తెలిసిందే. అక్టోబరు 10న జరగనున్న మా ఎన్నికలకు సంబంధించి..
MAA Elections 2021: ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు అత్యంత రసవత్తరంగా మారుతోన్న విషయం తెలిసిందే. అక్టోబరు 10న జరగనున్న మా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ప్రకాశ్ రాజ్, ఆయన ప్యానెల్ సభ్యులు నామినేన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం మధ్యాహ్నం మంచు విష్ణు, తన ప్యానెల్ సభ్యులతో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ క్రమంలో ముందుగా విష్ణు తన ఇంటి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలు దేరారు. ఒక్కొక్కరుగా ప్యానల్ సభ్యులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ క్రమంలో నామినేషన్ దాఖలుకు ముందు మంచు విష్ణు.. దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన విష్ణు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు తెలుగు నటుల ఆత్మగౌరవ పోరాటం అన్నారు. మా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తలదూర్చాల్సిన అవసరం లేదన్నారు. తమ మ్యానిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ ప్యానల్‌కు ఓటేస్తారని విష్ణు ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలపై తన తండ్రి మోహన్ బాబు మాట్లాడుతారన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పుకొచ్చారు.
ఇక మంచు విష్ణు ప్యానల్ విషయానికొస్తే.. అధ్యక్షుడిగా మంచు విష్ణు, ఉపాధ్యక్షులుగా మాదల రవి, పృథ్వీరాజ్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్, ట్రెజరర్‌గా శివ బాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కల్యాణి, గౌతమ్ రాజులు పోటీలో ఉన్నారు.
Also Read: Bigg Boss 5 Telugu: డేంజర్ జోన్లో ఆ ముగ్గురు.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా ?