Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinmayi Sripaada: పెళ్లయ్యాక మగాడు నటించవచ్చు.. కానీ అమ్మాయి నటించకూడదా ?.. సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్..

చిత్రపరిశ్రమలో అమ్మాయిలు ఎదుర్కోంటున్న సమస్యలు.. కాస్టింగ్ కౌచ్ గురించి.. మీటూ ఉద్యమంలో గళం విప్పింది సింగర్ చిన్మయి.

Chinmayi Sripaada: పెళ్లయ్యాక మగాడు నటించవచ్చు.. కానీ అమ్మాయి నటించకూడదా ?.. సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్..
Chinmayi
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Sep 28, 2021 | 7:02 PM

చిత్రపరిశ్రమలో అమ్మాయిలు ఎదుర్కోంటున్న సమస్యలు.. కాస్టింగ్ కౌచ్ గురించి.. మీటూ ఉద్యమంలో గళం విప్పింది సింగర్ చిన్మయి. అంతేకాకుండా… ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కోంటున్న లైంగిక వేదింఫులు.. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించింది. ఎప్పటికప్పుడు స్త్రీలపై జరుగుతున్న దాడులు.. వారు ఎదుర్కోంటున్న సమస్యలపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటుంది. అయితే తాజాగా చిన్మయి తన ఇన్‏స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లైన హీరోయిన్లు సినిమాల్లో నటించడం అనే అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

నా బంధువులలో ఓ వ్యక్తి పెళ్లి అయిన తర్వాత హీరోయిన్లు ఎందుకు సినిమాలు చేయకూడదో వివరించాడు. ఆయన ఓ డైరెక్టర్.. కానీ నా కుటుంబంలోని వ్యక్తులకే నచ్చజెప్పడం నిస్సహాయంగా భావిస్తున్నాను. లింగ సమానత్వం గురించి ఎన్నో ఆర్టికల్స్ చదివాను. నేనే వాటి గురించి ఎక్కువగా చర్చిస్తా కూడా. కానీ అలాంటి ఈరోజు నిస్సహయ స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఆయన చేసే వ్యాఖ్యలు విన్నప్పుడు నాలో వచ్చే మొదటి రియాక్షన్ కోపమే.. ఆ కోపంలో ఏదేదో మాట్లాడేస్తామోనని భయం. మళ్లీ దాని గురించి తర్వాత పశ్చాత్తాపడడం జరుగుతుంది. అంతే కాదు.. వాళ్లు చాలా తేలికగా ఫెమినిస్ట్ బ్యాచ్ అనే కామెంట్స్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది చిన్మయి.

ఇవే కాకుండా.. పెళ్లైన తర్వాత ఓక స్త్రీ హీరోయిన్‏గా నటించకూడదనేది ఒక విషపూరిత పితృస్వామ్య మనస్తత్వం.. సాధారణంగా.. ఒక అమ్మాయి… తాను కన్న కలలు, భవిష్యత్తు, డబ్బు, నిర్ణయాలే కాదు.. ఆమె శరీరం, గర్భాశయం కూడా పురుషుడికే సొంతమనే దారుణమైన మనస్తత్వంలో నుంచి ఇదంతా వచ్చింది. పెళ్లి తర్వాత అబ్బాయి నటించవచ్చు.. కానీ అమ్మాయి నటించకూడదనే ఆలోచనలకు సరైన కారణమేమిటో ఒక్కసారి ఆలోచించండి అని చిన్మయి పేర్కోంది. ప్రస్తుత సినీ ప్రపంచంలో ముగ్గురు హీరోయిన్లు.. ప్రస్తుతం ఉన్న సరిహద్దును చెరిపేశారు. వారు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె.. టాలీవుడ్ హీరోయిన్ సమంత, అలాగే ఇజ్రాయిల్ నటి. ముగ్గురు పిల్లలకు అమ్మ అయిన గాల్ గాల్ గాడోట్ తోపాటు మరెందరో.. మైలు రాయి తర్వాత మైలు రాయిని సాధించి భారీ అడ్డుకట్టలను తొలగించారు. నిజానికి 1950, 1960ల్లోనే ఇలాంటి ఆలోచనలు లేవు. అందుకు నిదర్శనం అలనాటి మహానటి సావిత్రి. పెళ్లి అయిన తర్వాత కూడా స్టార్ హీరోగా కొనసాగారు. ఒక పురుషుడి కెరీర్లో పెళ్లి అనేది ఎలాంటి ప్రభావం చూపకపోతే.. మహిళకు కూడా అదే వర్తించాలి. కచ్చితంగా నేను చెప్పుకుంటా నేను ఫెమినిస్ట్ బ్యా్చ్ నే అని అంటూ చిన్మయి సుదీర్ఘ పోస్ట్ చేసింది.

ఇన్‏స్టా పోస్ట్..

Also Read: Bigg Boss 5 Telugu: ఏడేళ్ల రిలేషన్.. అతడి కోసం కెరీర్‌నే వదిలేశాను.. సరయు సంచలన వ్యాఖ్యలు..

Drishyam 2: నారప్ప బాటలోనే దృశ్యం 2 సినిమా.. ఓటీటీ వైపే ఆసక్తి చూపిస్తున్న మేకర్స్ ?..