AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్‌ చరణ్‌ సినీ కెరీర్‌లో ఈరోజు చాలా స్పెషల్‌.. అభిమాన హీరోను సర్‌ప్రైజ్‌ చేసిన ఫ్యాన్స్‌..

Ram Charan 14 Years: తండ్రి మెగా స్టార్‌, బాబాయ్‌ పవర్‌ స్టార్‌.. వీరిద్దరి లక్షణాలను పుణికి పుచ్చుకున్న హీరో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. తొలి సినిమాతోనే తనలోని నట విశ్వరూపాన్ని చూపించారు చెర్రీ...

Ram Charan: రామ్‌ చరణ్‌ సినీ కెరీర్‌లో ఈరోజు చాలా స్పెషల్‌.. అభిమాన హీరోను సర్‌ప్రైజ్‌ చేసిన ఫ్యాన్స్‌..
Narender Vaitla
| Edited By: |

Updated on: Sep 28, 2021 | 7:02 PM

Share

Ram Charan 14 Years: తండ్రి మెగా స్టార్‌, బాబాయ్‌ పవర్‌ స్టార్‌.. వీరిద్దరి లక్షణాలను పుణికి పుచ్చుకున్న హీరో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. తొలి సినిమాతోనే తనలోని నట విశ్వరూపాన్ని చూపించారు చెర్రీ. పేరుకు నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అనతి కాలంలోనే టాలీవుడ్‌ అగ్ర హీరోల సరసన నిలిచారు రామ్‌ చరణ్‌. ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేటితో సరిగ్గా 14 ఏళ్లు పూర్తయ్యాయి. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమాలో సెప్టెంబ్‌ 28, 2007లో విడుదలైన విషయం తెలిసిందే. దీంతో చెర్రీ సినీ జీవితం 14 ఏళ్లు గడుస్తోన్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే అభిమానులు తమ అభిమాన హీరోకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. రాష్ట్ర రామ్‌ చరణ్‌ యువశక్తి పేరుతో ఉన్న ట్వి్ట్టర్‌ ఖాతాలో అద్భుతమైన వీడియోను పోస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు సమీపంలో రామ్‌ చరణ్‌ బొమ్మను గీసి రంగులతో దిద్దారు. దీనంతటినీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరో తమకు అందిస్తోన్న వినోదం, స్ఫూర్తి, ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.

ఇక రామ్‌ చరణ్‌ సినిమాల విషయానికొస్తే.. ఈ యంగ్‌ హీరో ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తర్వాత శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీలో నటించనున్నారు. మరి చెర్రీ ఫ్యాన్స్‌ ఇచ్చిన ఆ సర్‌ప్రైజ్‌ను మీరూ చూసేయండి..

Also Read: ఏడేళ్ల రిలేషన్.. అతడి కోసం కెరీర్‌నే వదిలేశాను.. సరయు సంచలన వ్యాఖ్యలు..

Drishyam 2: నారప్ప బాటలోనే దృశ్యం 2 సినిమా.. ఓటీటీ వైపే ఆసక్తి చూపిస్తున్న మేకర్స్ ?..

Love Story: లవ్‌ స్టోరీ మ్యాజికల్‌ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిధిగా ఎవరు హాజరువుతున్నారో తెలుసా.?